పూరీ సినిమా తర్వాత దేవరకొండ ప్లాన్ ఏంటి..?

shami

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్.. అదే డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, మళయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. బ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ మూవీకి టైటిల్ గా ఫైటర్ అని పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో రౌడీ హీరో డిఫరెంట్ స్టైల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.  

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఏ సినిమా చేస్తాడన్న ఆసక్తి ఆయన ఫ్యాన్స్ లో ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ ఆ సినిమాను హిందీలో తీసి అక్కడ హిట్టు కొట్టాడు. ఇక రణ్ బీర్ కపూర్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉండగా.. అర్జున్ రెడ్డి మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా పెళ్ళిచూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్ తో కూడా విజయ్ సినిమా ఉంటుందని టాక్.    

శివ నిర్వాణ డైరక్షన్ లో ఓ సినిమాతో పాటుగా ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా విజయ్ తో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్ అవగా పూరీ సినిమాతో హిట్టు కొట్టి ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు విజయ్ దేవరకొండ. కెరియర్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ భారీ సినిమాలనే లైన్ లో పెట్టాడని తెలుస్తుంది.                              

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: