మిలియనీర్ అయిపోతా అంటున్న ఎల్బీ శ్రీరామ్..?

Chakravarthi Kalyan

ఎల్బీ శ్రీరామ్.. తెలుగు సినీ పరిశ్రమలో కలంలో దమ్మున్న రచయిత.. నటనలో సహజత్వం ఉన్న కళాకారుడు. ఆయన కొంతకాలంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన కళాతృష్ణ తీర్చుకుంటున్నారు. తనదైన శైలిలో షార్టు ఫిల్మలు తీస్తున్నారు. వాటిని జనం కూడా ఆదరిస్తున్నారు. 

 

ఎల్‌బీ శ్రీరామ్ తన పేరుతోనే పెట్టుకున్న ఈ యూట్యూబ్ ఛానల్ కు లక్షా 32 మంది సబ్ స్క్రైబర్లు  ఉన్నారు. ఆయన రెండేళ్ల క్రితం తీసిన అదీ లెక్క అనే ఓ షార్ట్ ఫిల్మ్‌ ను ఇప్పటి వరకూ 9 లక్షల వ్యూస్ దాటాయి. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. 

 

తన షార్ట్ ఫిల్మ్ 9 లక్షల వ్యూస్ సాధించిందని నేరుగా చెప్పకుండా.. మీరు ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తే తాను బిలయనీర్ అవుతానంటూ చమత్కరించారు. మరి మీరు కూడా ఆ షార్ట్ ఫిల్మేదో చూసేయండి.. అన్నట్టు ఈ కరోనా కాలంలో తన హార్టు ఫిల్ములు చూసి మీ హార్టు కు బలం చేకూర్చుకోండి అంటున్నాడీ వెటరన్ ఆర్టిస్టు. ఎలాగూ కరోనా కాలంలో సినిమా షూటింగులు కూడా లేవు కదా.. అందుకే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్ములతో జోరు పెంచేశారు శ్రీరామ్. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: