'అతిథి' గా అనాధ పాత్రలో ఒదిగిపోయి నటించిన సూపర్ స్టార్ .....!!

GVK Writings

సూపర్ స్టార్ మహేష్ బాబు, సురేందర్ రెడ్డిల తొలి కలయికలో 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అతిథి. మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ అమృతా రావు హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘట్టమనేని రమేష్ బాబు నిర్మించారు. అప్పట్లో మంచి అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అనాదైన ఒక కుర్రాడిని చిన్నప్పుడే ఒక జంట చేరదీసి, అతడిని తమ కూతురితో పాటు సమానంగా చూసుకుంటూ ఉంటారు. 

అనంతరం ఒకానొక ఘటనలో విలన్ చేతిలో పాప తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడం, అదే సమయంలో గన్ ఆ కుర్రాడి చేతిలో ఉండడంతో, అతడే తన తల్లితండ్రులను చంపి ఉంటాడని, వారి కూతురు, ఆ కుర్రాడి పై ద్వేషం పెంచుకుంటుంది. అనంతరం ఆ కుర్రాడు జైలు పాలై కొన్నేళ్ల పాటు అక్కడే పెరగడం జరుగుతుంది. ఆపై కొన్నేళ్లకు జైలు నుండి విడుదలయిన తర్వాత, తన జీవితం నాశనం అవడానికి కారణమైన విలన్ ని పట్టుకోవటానికి పలు ప్రయత్నాలు చేస్తాడు హీరో. ఇక అదే సమయంలో హీరోయిన్ అతనికి తారసపడడం, ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడడం జరుగుతుంది. ఆ తరువాత ఒకానొక సమయంలో తనను చేరదీసిన ఆ జంట కూతురే ఈ అమ్మాయి అని హీరో తెలుసుకుంటాడు. 

ఆపై కథ పలు మలుపులు తిరగడం, చివరికి తన పరిస్థితి కారణమైన విలన్ ని అతడు కనిపెట్టి హతమార్చడం జరుగుతుంది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు అతిథి, ఆ పాత్ర లో ఆయన ఎంతో ఒదిగిపోయి సహజ నటన కనబరిచారు చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో మహేష్ కు, హీరోయిన్ అమృతరావుకు మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల మనసులను తాకుతాయి. లాంగ్ హెయిర్, డిఫరెంట్ మేకోవర్ తో సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో కనపడతారు. హీరోయిన్ గా అమృత రావు చక్కటి అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సాంగ్స్ శ్రోతలను విశేషంగా అలరించాయి .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: