రెమ్యునరేషన్ విషయంలో ఆమె చాలా స్పెషల్ !

NAGARJUNA NAKKA

కరోనాకు అందరూ భయపడుతున్నా.. వైజయంతీ మూవీస్ మాత్రం కేర్ చేయడం లేదు. పరిస్థితులు బాగోలేవు.. బడ్జెట్ కంట్రోల్ చేయాలన్న ఆలోచన కొంతైనా లేదు. సాధారణ రోజుల్లో ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించారు. ఒక్క హీరోయిన్ కే మన స్టార్స్ కు ధీటుగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. ఈ లెక్కన బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

 

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 50ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రీన్ని ఎనౌన్స్ చేసింది. అల్లుడు నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో అశ్వనీదత్ నో బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ మూవీతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని దర్శకుడు గతంలో చెప్పాడు. ఈ పాన్ వరల్డ్ బడ్జెట్ 200కోట్లా.. 400కోట్లా అని నిర్మాతే చెప్పలేకపోతున్నాడు. బడ్జెట్ ఎంతైనా అనవసరం.. వైజయంతీ మూవీస్ లో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుందన్న నమ్మకంతో నిర్మాత ఉన్నారు. 

 

పాన్ వరల్డ్ కాన్సెప్ట్ కు తగ్గట్టే హీరోయిన్ ను ఎంపిక చేశారు. దీపిక పదుకునే ప్రభాస్ తో జత కడుతున్నట్టు.. వైజయంతీ మూవీస్ ఎనౌన్స్ చేసింది. సినిమాకు 15కోట్లు తీసుకునే దీపిక.. ఈ సినిమా కోసం పారితోషికం బదులు హిందీ రైట్స్ లో షేర్ తీసుకుందట. 15కోట్లు డిమాండ్ చేసిన దీపిక.. షేర్ రూపంలో రెమ్యునరేషన్ కు డబుల్ సంపాదిస్తోందట. కరోనా టైమ్ లో ఖాళీగా కూర్చున్నందుకు.. గండిపడ్డ ఆదాయాన్ని కూడా ఈ తెలుగు సినిమాతో రాబడుతోందన్నమాట. 

 

బాహుబలి 2 బాలీవుడ్ లో 500కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో.. సాహో హిందీ వెర్షన్ ను 10కోట్లకు అమ్మారు. సినిమా అన్ని భాషల్లో ఫ్లాప్ అయినా.. హిందీలో మాత్రం పెట్టుబడిని రాబట్టింది. ప్రభాస్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ను చూసిన దీపిక.. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ కోసం పారితోషికం తీసుకోకుండా.. హిందీ రైట్స్ లో షేర్ అడిగిందట. ఇండస్ట్రీనే కాదు.. బాలీవుడ్ కూడా ఇంతవరకు ఏ హీరోయిన్ కూ ఇవ్వని రెమ్యునరేషన్ దీపిక సొంతం అయింది. 

 

కథపై ఎంత నమ్మకం ఉన్నా.. శక్తికి మించి ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తారు. నాగ్ అశ్విన్, ప్రభాస్ మూవీ వైజయంతి మూవీస్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచిపోతుందన్న కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు నిర్మాత. నటీనటుల ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. దీపికతో పాటు.. బాలీవుడ్ కు చెందిన చాలామంది నటీనటులు ఈ సైంటిఫిక్ మూవీలో నటించే అవకాశముంది. ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ పూర్తికాగానే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మొదలవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: