అనాథగా రవితేజ నటన అదుర్స్ అంతే!!
మాస్ మహారాజ రవితేజ, కల్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. మాళవికా శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ తాళ్ళూరి నిర్మించారు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో వరుస విజయాలు సాధించిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ.. కొంత గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా పక్కా కమర్షియల్ మాస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనాథగా పెరుగుతూ అందరితో నేల టిక్కెట్టు (రవితేజ) అని పిలిపించుకునే కుర్రాడికి జనాలంటే పిచ్చి. చుట్టూ జనం ఉండాలి. మధ్యలో మనం ఉండాలి అనుకునే రకం అతను.
ఈ క్రమంలోనే ప్రతి మనిషిలో ఓ బంధాన్ని, బంధుత్వాన్ని చూసుకుంటూ... అందరినీ ఏదో ఒక వరుసలతో పిలుస్తాడు. బంధుత్వంతో పిలిస్తే ఎంత రిస్క్ తీసుకుని అయినా ఎదుటివ్యక్తి సహాయం చేసేస్తాడు. అలాంటివాడు అనుకోకుండా రాష్ట్ర హోం మంత్రి ఆదిత్య భూపతి (జగపతిబాబు) మనుషులతో తలపడాల్సి వస్తుంది. అసలు నేల టిక్కెట్టు ఎవరు, హోం మంత్రి ఆదిత్య భూపతి కి నేల టిక్కెట్టు కు ఉన్న గొడవ ఏంటి అన్నదే సినిమా కథ.
చెప్పుకోవడానికి కథలో పెద్దగా బలం లేకపోయినప్పటికీ.. నేల టిక్కెట్టు గా అనాథ పాత్రలో రవితేజ అభినయం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది , సినిమాని తన భుజ స్కంధాలపై మోసి వన్ మాన్ షో చేసాడు రవితేజ. ఎమోషనల్ సీన్స్ లో మరియు హీరోయిన్ వెంట పడే సన్నివేశాల్లో రవితేజ మరింత చలాకీగా కనిపించాడు. ఇక ఆనాధలు, వృద్ధుల ఎపిసోడ్స్‌లో అయితే రవితేజ నటన అదర్స్ అని చెప్పాలి. అయితే పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో పాటు సందేశాత్మక కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆ కథను ప్రేక్షకులను మెప్పించేలా తెర మీద చూపించటంలో సక్సెస్ కాలేకపోయాడు.