వాస్తవాలు తెలుసుకోరా .....మీకు ఏది తోస్తే అదే రాసేస్తారా ....??

GVK Writings

కొన్నేళ్ల క్రితం మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో మెగాఫోన్ పట్టి, సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు ఒకరు, ఆ తరువాత నుండి ఎక్కువగా ఆ తరహా సినిమాలనే తీస్తూ ముందుకు సాగుతున్నారు. దర్శకుడిగా ఆయన తీసే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయనప్పటికీ, సాధారణ ప్రేక్షకుడి మదిని తాకేలా తెరకెక్కుతాయి. అలానే ఆయన తీసిన పలు సినిమాలు విమర్శకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటాయి. మూడేళ్ళ క్రితం ఒక సీనియర్ స్టార్ హీరోతో మంచి హిస్టారికల్ మూవీ తీసి సక్సెస్ అందుకున్న సదరు దర్శకుడు, ప్రస్తుతం ఒక స్టార్ హీరోతో భారీ చిత్రం తీస్తున్నారు. 

 

ఇప్పటికే ఇరవై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాకు సంబంధించి టైటిల్, అలానే కథా విషయమై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో, కొంత విసుగు చెందిన ఆ దర్శకుడు, ఇటీవల కొంత కోపంతో ఊగిపోయినట్లు చెప్తున్నారు. ఒక సినిమాకు కథ నిర్ణయమై, ఆ తరువాత నిర్మాత, నటీనటుల ఎంపిక అనంతరం అది పట్టాలెక్కుతుందని, ఆపై దశల వారీగా సన్నివేశాలను షూటింగ్ చేస్తామని, అలానే సినిమా కథ, కథనాల విషయమై ప్రతి దర్శకుడు ఎంతో శ్రద్ధ తీసుకుని సినిమాని తీస్తాడని, మొత్తంగా ఒక సినిమా తీయాలి అంటే ఈ విధంగా ఎంతో శ్రమ పడతాం అని చెప్పుకొచ్చాడట. 

 

అయితే మా శ్రమ, ఆవేదనను ఏ మాత్రం గుర్తించని కొందరు మీడియా వారు మాత్రం, తమకు తోచిన విధంగా, ఫలానా సినిమా కథ ఇది, ఆ కథను పూర్వం మరొక హీరోతో అనుకొని, ప్రస్తుతం ఈ హీరోతో తీస్తున్నారు, టైటిల్ ఇది పెడదాం అనుకుంటున్నారు, ఆ సీన్ అలా ఉంటుందట అంటూ, ఎవరికి తోచింది వారు రాసిపారేస్తున్నారని, అసలు ఒక సినిమాకు సంబంధించి ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, యూనిట్, ఇలా వారందరి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా వారి పీఆర్ టీమ్ నుండి మనకు వచ్చని సమాచారం ఏంటనేది తెలుసుకుని రాయాలని, అంతేకాని ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చిన విధంగా వారు రాసేయడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించినట్లు సమాచారం. మరి, ఇంతకీ ఆ దర్శకుడు ఎవరై ఉంటారా అంటూ ఇప్పటికే టాలీవుడ్ జనాలు తీవ్ర చర్చలు మొదలెట్టేసారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: