ఆర్జీవి 'పవర్ స్టార్' ట్రైలర్ లీక్.. పాతిక పెట్టక్కర్లేదు ఫ్రీగా చూసేయండి..!

shami

పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ చేస్తున్న సినిమా పవర్ స్టార్. ఈ నెల 25న సినిమాను ఆర్జివి వరల్డ్ ఏటిటి ద్వారా రిలీజ్ చేస్తున్నాడు వర్మ. ఇక ఈ సినిమా ట్రైలర్ 22న ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశాడు. సినిమా ట్రైలర్ కు పాతిక రూపాయల టికెట్ పెట్టి ఇలా కూడా ఆడియెన్స్ జేబుకి చిల్లుపెట్టే ప్లాన్ చేశాడు వర్మ. అయితే ఆయన రిలీజ్ చేయడానికి ముందే ఈ ట్రైలర్ లీక్ అయ్యింది. ఎలా లీక్ అయింది.. ఎవరు లీక్ చేశారో తెలియదు కాని ఆర్జివి పవర్ స్టార్ సినిమా ట్రైలర్ లీక్ అయ్యింది. 

 

చెప్పినట్టుగానే ఏపి ఎలక్షన్స్ తర్వాత కథతో పవర్ స్టార్ సినిమా చేస్తున్నాడు ఆర్జీవి. పవన్ కళ్యాణ్ కాస్త సినిమాలో ప్రవన్ కళ్యాణ్ ను చేసి.. ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్ ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు. తన స్పీచ్ లకు లక్షల మంది జనాలు, మాట్లాడితే ఈలలు, సిఎం సిఎం అని అరవడం లాంటి వాటి గురించి ప్రస్థావించడం ట్రైలర్ లో హైలట్ పాయింట్స్. ఒకసారి నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పరా.. నువ్వు పవర్ స్టార్ అయ్యింది.. కాఇస్టేబుల్ కొడుకుగానా..లేక నా తమ్ముడిగానా అంటూ, సినిమాలో చిరుని కూడా ఇన్వాల్వ్ చేశాడు. ఇక పవన్ స్పీచ్ లను ఓ ప్రముఖ దర్శకుడు రాసిస్తాడని రూమర్ ఉంది. అలాంటి ఓ సందర్భాన్ని కూడా ఇందులో పెట్టాడు ఆర్జీవి.   

 

ఇక పవన్ భక్తుడు బండ్ల గణేష్ పాత్రని చూపించాడు. మొత్తానికి ట్రైలర్ అభిమానులకు అంకితం ఇస్తూ పవర్ స్టార్ ట్రైలర్ లో ఎప్పటిలానే సినిమాపై అంచనాలు పెంచేలా చేశాడు వర్మ. చివరగా జై పవర్ స్టార్ అని వేయడం విశేషం. మరి ట్రైలర్ చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: