పురుషాధిఖ్య ప్రపంచం పై విద్యాబాలన్ సెటైర్లు !
ప్రస్తుతం సినిమాలు అన్నీ ఓటీటీ ల ద్వారానే విడుదల అవుతున్నాయి. ఈపరిస్థితులలో ఈనెల 31న అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ లో విడుదలకాబోతున్న ‘శకుంతలా దేవి’ మూవీని ప్రమోట్ చేస్తూ విద్యాబాలన్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
హ్యూమన్ కంప్యూటర్ గా పేరుగాంచి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకోవడమే కాకుండా ఒక రాజకీయవేత్తగా జ్యోతిషురాలుగా పేరుగాంచిన శకుంతలా దేవి ఎప్పుడు మంచిమంచి దుస్తులు వేసుకుంటూ ఉండటమే కాకుండా డాన్స్ చేయడంలో వంటచేయడంలో శకుంతలా దేవి నిష్ణాతురాలు. వాస్తవానికి శకుంతలా దేవికి ఉన్న ఆ రంగాలలోని సమర్థతలలో తనకు ఏ రంగంలోనూ సమర్థత లేకపోయినా తాను శకుంతలా దేవి అన్న ఊహతో ఈ పాత్రలో తాను పరకాయ ప్రవేశం చేసాను అని అంటోంది.
ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను తరుచూ తన భర్తతో అనేమాట ‘నాకు బిడ్డ కావాలి భర్త కాదు’ అనే డైలాగ్ ఈ మూవీలో శకుంతలా దేవి పాత్ర ద్వారా చెప్పించడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించింది అని అంటోంది. ‘డర్టీ పిక్చర్’ లో తాను సిల్క్ స్మిత పాత్ర పోషించినప్పుడు తానే సిల్క్ స్మిత అన్నభావంతో ఆ మూవీలో నటించానని ఇప్పుడు శకుంతలా దేవి పాత్రలో నటిస్తున్నప్పుడు కూడ తనకు కూడ శకుంతలా దేవి లా అన్ని విషయాలు తెలుసు అన్నఅహంతో నటించాను అని అంటోంది.
ఈ మూవీలో ‘బేబీ చాహియే థా... పతి నహీ’ లాంటి డైలాగ్స్ తో పాటు ప్రజలు ముఖ్యంగా పురుషులు ఇబ్బందిపడే డైలాగ్స్ ఉన్నాయి అంటూ సంకేతాలు ఇస్తున్న విద్యాబాలన్ మాటలను బట్టి ఈ మూవీలో కూడ కొన్ని వివాదాలు ఉన్నాయి అన్న లీకులు వస్తున్నాయి. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ బాగా కొనసాగుతున్న పరిస్థితులలో ఈ మూవీకి మంచి ప్రశంసలు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది..