నెక్స్ట్ వర్మ టార్గెట్ ఆ రాత్రి ఏమి జరిగిందంటే !
సినిమాలు విడుదలలేక ధియేటర్లు షూటింగ్ లు లేక నటీనటులు ఖాళీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ మాత్రం వరసపెట్టి సినిమాలు తీస్తూ తెగ సందడి చేస్తున్నాడు. వర్మ హడావిడి పవర్ స్టార్ మూవీతో తారా స్థాయికి చేరుకుంది. ఈసినిమా విడుదలై రిజల్ట్ రాకుండానే వర్మ తన నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది.
ప్రస్తుతం వస్తున్న లీకుల ప్రకారం వర్మ బాలకృష్ణ పై స్వీట్ రివెంజ్ తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ తీస్తున్న రోజులలో వర్మను ఈ మూవీ దర్శకత్వ బాధ్యతను తీసుకోమని అప్పట్లో బాలయ్య అడిగాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఆతరువాత వర్మ స్థానంలో తేజా అతడి స్థానంలో క్రిష్ లు రావడంతో ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్నోమార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆ సందర్భానికి సమాధానంగా వర్మ ఒకప్పుడు బాలకృష్ణ ఇంటిలో జరిగిన కాల్పుల సంఘటనను ఆధారంగా తీసుకుని ‘ఆరాత్రి ఏమిజరిగిందంటే’ మూవీని ప్లాన్ చేస్తూ ఈ మూవీలో నటించడానికి బాలకృష్ణ బెల్లం కొండ సురేశ్ పోలికలతో ఉండే వ్యక్తులకోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు టాక్. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఈ మూవీ వార్తలను ఖండించక పోవడంతో వర్మ ఆలోచనలలో ఈమూవీ మొదటి వరసలో ఉంది అని అనిపించడం సహజం.
బాలకృష్ణ వ్యక్తిగత జీవితంలో జరిగిన అతి వివాదాస్పదమైన ఈ సంఘటన ఆధారంగా సినిమా తీస్తే అది బాలయ్య అభిమానులకు మాత్రమే కాకుండా బాలకృష్ణకు షాక్ ఇచ్చే సంఘటన. మరి వర్మ చేసే ఈ ప్రయత్నాలకు బాలయ్య నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అయితే వర్మ చేసే ఈ ప్రయత్నం పవర్ స్టార్ మూవీ విజయం బట్టీ ఆధారపడి ఉంటుంది. ఈ మూవీకి వర్మ ఆశించిన విధంగా కాసులు కురిస్తే వర్మ నెక్స్ట్ టార్గెట్ బాలయ్య అనడంలో ఎటువంటి సందేహం లేదు..