ఊహించని రేంజ్ లో జాతీయస్థాయిలో విజయం సాధించిన కే.జి.ఎఫ్...!
కన్నడ రాక్ స్టార్ 'యష్ ' నటించిన కె.జి.యఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అప్పట్లో ఎలాంటి అంచనాలు, హంగామా లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన సినిమా KGF… కన్నడ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీస్తూ మొట్ట మొదట సారిగా కర్ణాటకలో 200 కోట్ల వసులు చేసిన సినిమాగా నిలిచినది కె.జి.ఎఫ్. అంతేకాదు కె.జి.ఎఫ్ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మెంటల్ మాస్ అనిపించే విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్' నేపథ్యంలో అల్లుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీ. ఈ సినిమాలో హీరోని ..హీరోయిజాన్ని బాగా చూపించారు.
ఈ సినిమాలోని హీరో మాస్ యాంగిల్ చుస్తే అభిమానులు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. అలాగే యష్ లుక్ స్టైలిష్ గా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా కథ విషయంలో కొంత భారితనం ఉంటుంది. అలాగే సినిమా విషయానికి వస్తే.. 'పుట్టేటపుడు పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు. పోయేటపుడు పేదవాడిగా పోతే మాత్రం నీ తప్పే' అనే కొటేషన్ నుంచి మొదలవుతుంది. అలాగే'ఎలా బతుకుతావో తెలీదు.కానీ చనిపోయేటపుడు మాత్రం రాజులా, శ్రీమంతుడిలా చనిపోవాలి' అని ఓ పిల్లాడికి తన తల్లి చెప్పడంతో కె.జి.యఫ్ మొదలవుతుంది. తల్లి మాటని అనుసరించి డబ్బు కోసం, పవర్ కోసం పసితనం నుంచి తపించిపోయే పిల్లాడు రామకృష్ణ పవన్. ముంబయిని గడగడలాడించే రాకీ (యష్) అనే బ్రాండ్‌గా ఎదుగుతాడు. ఒక గ్యాంగ్ స్టార్ ని చంపడం కోసం కె.జి.యఫ్ గనుల్లోకి ఒక కార్మికుడిగా వెళతాడు. అక్కడ్నుంచి అదను చూసి తన లక్ష్యం ఎలా చేరుకుంటాడనేది కె.జి.యఫ్ మొదటి అధ్యాయం. చిన్న పిల్లాడిగా పవర్ కోసం పాకులాడిన రాకీ పెద్దయ్యే సరికి చావు దెబ్బలు తిని, చేతులు ఇనప గొలుసులతో కట్టేసి వున్నా వంద మంది రౌడీలు వణికిపోయే వస్తాదు అన్నట్టుగా పరిచయమవుతాడు. అతడిని డాన్ అనడానికి లేదు.ఎందుకంటే అతని వెంట ఒక గ్యాంగ్ వుండదు.కానీ అతను ఒక్కడు కూర్చుని వుంటే వందల మంది వెనక్కి పారిపోతుంటారు.
ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఒక్కడే అన్నట్టుగా ఆది నుంచీ రాకీని సూపర్ పవర్‌లా చిత్రీకరిస్తూ వెళ్లడమే కాకుండా అతని ధీరత్వాన్ని, కండబలాన్ని సినిమాలో బాగా చూపించారు.ఎలాంటి అంచనాలు లేకుండా కె.జి.ఫ్ సినిమా రిలీజ్ అయ్యి జాతీయంగా పేరు ప్రఖ్యాయతలు తెచ్చి పాపులర్ అయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. కె.జి.ఫ్ మొదటి భాగం హిట్ అవ్వడంతో రెండో పార్ట్ పై ఎక్కడ లేనన్ని అంచనాలు ఇప్పుడు టోటల్ ఇండియా వైడ్ గా ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు ఆ సినిమా వస్తుందా అని ఆడియన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు.