హీరో అఖిల్ టాటూని వేసుకున్న యాంకర్ విష్ణుప్రియ
దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగితే ఖచ్చితంగా అఖిల్ కావాలని కోరుకుంటానంటూ పోవే పోరా షో యాంకర్ విష్ణుప్రియ అంటున్నారు. అఖిల్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో అఖిల్ పేరును ఆమె తన చేతిపై పచ్చబొట్టును కూడా వేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మథుడిగా, రొమాంటిక్ హీరోగా పేరొందిన నాగార్జున ఆరు పదుల వయస్సులో కూడా ఆయనను చూసి పడి చచ్చే అమ్మాయిలు ఉండరు. ఇక ఆయన వారసత్వాన్ని తీసుకున్న నాగ చైతన్య, అఖిల్ లకు కూడా అమ్మాయిల ఫాలోయింగ్ మరీ ఎక్కవ. తండ్రికి తగ్గ కొడుకులని పేరు. నాగచైతన్యకు ఫోలోయింగ్ ఉన్నా సమంతతో వివాహంతో ఆ ఫాలోయింగ్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.
అఖిల్ మాత్రం తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త (జీవీకే సంస్థ) జీవీ. కృష్ణారెడ్డి మనవరాలు శ్రీయా భూపాల్ తో కొంతకాలం ప్రేమాయణం సాగింది. 2016 డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి ప్రేమ వార్తల్లో నిలుస్తున్న అఖిల్ పై మనసు పారేసుకున్నానని యాంకర్ విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాదు అఖిల్ అంటే పిచ్చని.. ఎంత పిచ్చంటే అఖిల్ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేసుకునేంత అంటూ.. పెళ్లి కోసం నాగార్జునను కోరినట్లు మరో యాంకర్ శ్రీముఖి షాకింగ్ సీక్రెట్ ను బయటపెట్టింది.
లాక్ డౌన్ టైంలో స్టార్ మాలో స్టార్ట్ అయిన కొత్త షో ‘లవ్యూ జిందగీ’ కార్యక్రమంలో యాంకర్ ఝాన్సీతో ఇప్పటి వరకూ నాలుగు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.నాలుగో ఎపిసోడ్ లో శ్రీముఖి, విష్ణుప్రియలతో మాట్లాడినప్పుడు గేమ్ లో భాగంగా ఒక సీక్రెట్ ను రిలీవ్ చెయ్యమని యాంకర్ ఝాన్సీ అడిగింది. శ్రీముఖి మాట్లాడుతూ.. విష్ణుకి అఖిల్ అంటే పిచ్చి అంటూ.. నీ టాటూని చూపించమని అడిగితే.. విష్ణుప్రియ చేతిని చూపిస్తూ.. శ్రీముఖి.. ఇందులో ఏ (అఖిల్) అండ్ విష్ణుప్రిమ అని చెప్పింది.