బిగ్ బాస్ షోపై నాగార్జున ధర్మసందేహాలు !
గత కొన్నిరోజులుగా ‘బిగ్ బాస్’ షో సీజన్ 4 గురించి అనేకవార్తలు వస్తూనే ఉన్నాయి. ఈషోలో పాల్గొనబోయే హౌస్ మేట్స్ పేర్లు కూడ బయటకు లీక్ అవుతున్నాయి. అయితే ఈపేర్ల పై అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాకపోయినా ‘బిగ్ బాస్ సీజన్ 4’ త్వరలో ప్రారంభంకాబోతోంది అన్న క్లారిటీ స్టార్ మా టీమ్ నుండి రావడంతో మరికొద్ది రోజులలోనే ఈషో బుల్లితెర పై జనం చూడబోతున్నట్లు క్లారిటీ వచ్చింది. ఇప్పటికే ఈషోను మరొకసారి హోస్ట్ చేయడానికి నాగార్జున అంగీకరించిన పరిస్థితులలో త్వరలో ఈషోకి సంబంధించిన ఒక ప్రోమోను నాగ్ హోస్ట్ చేస్తున్నట్లుగా చిత్రీకరించబోతున్నట్లు టాక్.
ఇప్పటివరకు అన్నీ ఈషోకి సంబంధించిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నా నాగ్ కు ఇప్పటికీ ఈషోకి సంబంధించి కొన్ని ధర్మసందేహాలు వస్తున్నట్లు టాక్. సినిమా షూటింగ్ లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షూటింగ్ నిర్వహణ ఈజీ. ఎందుకంటే ఆహౌస్ లోపలకు ఒక్కసారి వెళ్ళినవాళ్ళు బయటకువచ్చే పని ఉండదు. దీనితో వారికి కరోనా వైరస్ లు వస్తాయి అన్నభయాలు ఉండవు. దీనితో ఈషో కోసం హౌస్ లోకి వెళ్ళే వాళ్ళకి ఒకటికి నాలుగు సార్లు పరీక్షలు జరిపించి పంపించిన తరువాత లోపల ఉన్నపుడు కూడా క్రమం తప్పకుండా టెస్టులు చేస్తూ ఉంటే సమస్యలు రావు అని బిగ్ బాస్ టీమ్ నాగార్జునకు ధైర్యం చెపుతున్నట్లు టాక్.
అదేవిధంగా టాస్క్ ల విషయంలో ఫిజికల్ టాస్క్ లు తగ్గించి హౌస్ మేట్స్ తెలివితేటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక్కడ కూడ సమస్యలు ఉండవు అని స్టార్ మా యాజమాన్యం నాగ్ కు క్లారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఈ షోకి సంబంధించి వీకెండ్స్ లో వచ్చే స్టూడియో ఆడియన్స్ ని రిస్ట్రిక్ట్ చేసుకుని అలాగే బిగ్ బాస్ స్టాఫ్ కి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు అని నాగార్జునకు ధైర్యం నూరి పోస్తున్నట్లు టాక్.
అయితే నాగార్జున మాత్రం ఈషో నిర్వాహణలో ఒకచిన్న పొరపాటు జరిగినా ఏఒక్కరికి కరోనా ఛాయలు కనిపించినా అది మీడియాకు హాట్ టాపిక్ గా మారి ఈషో బ్యాన్ చేయాలని గోల చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులు ఇలాఉండగా నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు ముందు సీజన్లలో ఇచ్చినట్టుగా భారీ పారితోషికాలు ఇవ్వడానికి స్టార్ మా సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ద్వారా వచ్చే క్రేజ్ ను సొమ్ము చేసుకుని ఎంతైనా డబ్బు సంపాదించవచ్చని నిర్వాహకులు చెబుతున్నట్టుటాక్. దీనితో ఈషోలోకి రావాలి అనుకుంటున్నచాలామంది వెనకడుగు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పరిస్థితులు ఎలాఉన్నా ఆగష్టు నెలాఖరు నుంచి ఈషోను మొదలుపెట్టాలి అని భావిస్తున్న స్టార్ మా యాజమాన్యానికి పూర్తిగా నాగార్జునకు ధైర్యం ఎలాచెప్పాలి అన్నవిషయమై భారీకసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది..