చిరు మీసాలు తీయడం వెనుక అసలు నిజం..!

NAGARJUNA NAKKA

చిరంజీవి వయసు 64. ఒక్కసారిగా 30ప్లస్ హీరోగా మారిపోయాడు. అలాగని వయసును గ్రాఫిక్స్ తో కవల్ చేయలేదు. యోగాలు.. ఆసనాలు వేయలేదు. కసరత్తులు అంతకంటే చేయలేదు. ట్రీట్ మెంట్ తీసుకోలేదు. మరి ఏం చేసి ఈ అరవై ఏళ్ల హీరో తన వయసును సగానికి తీసుకొచ్చాడో తెలుసా. 

 

లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉన్న చిరంజీవికి ఓ ఐడీయా వచ్చింది. మీసాలు తీస్తే ఎలా ఉంటుందన్న ఐడియా రావడం ఆలస్యం దాన్ని ఆచరణలో పెట్టేశాడు. ఆచార్య షూటింగ్ లో భాగంగా మీసాల్లేని గెటప్ ఉంటుందని చాలా మంది ఊహించారు. కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న ఆచార్య షూటింగ్ ఇప్పట్లో మొదలు కాలేదు. ఇప్పటి నుంచే మీసాలు తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ న్యూలుక్ కోసం.. తనని తాను కొత్తగా చూసుకున్నాడు. గతంలో సైరా షూటింగ్ లేని టైమ్ లో కూడా ఒకసారి ఇలాగే మీసాలు లేకుండా కనిపించి షాక్ ఇచ్చాడు మెగాస్టార్. 

 

ఆఫ్ స్క్రీన్ లో మీసాల్లేకుండా ఒకటి రెండు సార్లు కనిపించిన చిరంజీవి.. సినిమాల్లో మాత్రం మీసాలు ఉండాల్సిందే. ఆపద్బాంధవుడులో శివుడిగా మీసాలతో కనిపించాడు. అయితే.. చంటబ్బాయి మూవీ కోసం మీసాలు తీశాడు. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హరిదాసుగా.. లేడీ గెటప్ లో మీసాల్లేకుండా కొత్తగా కనిపించాడు చిరంజీవి. 

 

మెగాస్టార్ చిరంజీవి అంటే పడి చచ్చే అభిమానులు లక్షలాది మంది అభిమానులున్నారు. ఆయన ఏం చేసినా అది సెన్సేషనే అవుతుంది. ముఖ్యంగా లాక్ డౌన్ టైమ్ లో తమ అభిమాన హీరో ఏం చేస్తున్నాడని చాలా మంది ఆలోచించారు. ఇంటి పనుల్లో నిమగ్నమవడం చూసి ఆదర్శంగా తీసుకున్నారు. ఇంట్లో మొక్కలకు నీళ్లు పట్టడం.. పిల్లలతో ఆడుకోవడం ఇలా సరదా సరదాగా కనిపించారు. ఎపుడూ షూటింగులతో బిజీగా కనిపించే చిరు ఇలా కొత్తగా దర్శన మివ్వడం అభిమానుల్లో ఆసక్తిని రేపింది. అదే విధంగా చిరు త్వరలో ఆచార్యతో అభిమానుల ముందుకు రానున్నాడు. అయితే ఆయన ఇంట్లో ఉన్నపుడు మీసాలు తీసి కనిపించడంతో ఇది కూడా ఆ సినిమాలో భాగమే కాబోలు అనుకున్నారు. అయితే ఆ సమాచారం కరెక్ట్ కాదని తేలిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: