ప్రభాస్ ప్రవర్తన పై భాగ్యశ్రీ షాకింగ్ కామెంట్స్ !

Seetha Sailaja

1989 లో విడుదలైన ‘మైనే ప్యార్ కియా’ అప్పట్లో ఒక సంచలనం. ఈమూవీ ‘ప్రేమ పావురాలు’ పేరుతో తెలుగులో డబ్ చేయబడి ఏకంగా 100 రోజులు ప్రదర్శింపబడి రికార్డును క్రియేట్ చేసింది. డబ్బింగ్ సినిమాలలో ‘ప్రేమ పావురాల’ కలక్షన్స్ ను ఇప్పటికీ ఏ డబ్బింగ్ సినిమా క్రాస్ చేయలేకపోయింది అని విశ్లేషకులు అంటారు. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ ఆరోజులలో క్రేజీ బ్యూటీ ఆతరువాత ఆమె పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయి సినిమాలకు దూరం అయింది.


అయితే ఆమె ఆ మధ్య మళ్ళీ అడవి శేషు నటిస్తున్న ‘2 స్టేట్స్’ మూవీతో మళ్ళీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిచింది. అయితే ఆ మూవీ మధ్యలో ఆగిపోవడంతో భాగ్యశ్రీ టాలీవుడ్ రీ ఎంట్రీ పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆమె ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ ఒక కీలక పాత్రకు ఎంపిక కావడంతో భాగ్యశ్రీ సంబంధించిన వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.


ఈ సందర్భంలో ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ‘బాహుబలి’ మూవీ లో ఉగ్ర రూపంతో కనిపించిన ‘బాహుబలి’ పాత్రలో ప్రభాస్ ను చూసిన భాగ్యశ్రీ కి ప్రభాస్ కు నిజ జీవితంలో కూడ చాలకోపం ఎక్కువ అని భావించిందట.


అయితే ‘బాహుబలి’ విడుదల అయిన తరువాత ఒక ఫంక్షన్ లో ప్రభాస్ ను చూసి తాను షాక్ అయిన విషయాన్ని బయటపెట్టింది. ‘బాహుబలి’ మూవీలో ఎంతో కఠినంగా గంభీరంగా కనిపించిన ప్రభాస్ ఆ ఫంక్షన్ లో నవ్వుతూ అందరితో కలిసిపోయే ఒక చిన్న  పిల్లవాడిలా కనిపించాడని ప్రభాస్ నవ్వులో తనకు చిన్న పిల్లలలో కనిపించే అమాయకత కనిపించింది అని అలాంటి వ్యక్తికి తాను తల్లిగా నటించడం తనకు చాల ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. భాగ్యశ్రీ చేసిన ఈ కామెంట్స్ ప్రభాస్ అభిమానుల మధ్య ప్రస్తుతం వైరల్ గా మారాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: