ప్రభాస్ పెళ్లిపై మళ్లీ చర్చలు..!

NAGARJUNA NAKKA

టాలీవుడ్ లో వెడ్డింగ్ వైబ్స్ పాస్ అవుతున్నాయి. బ్యాచిలర్ క్లబ్ లో ఒక్కో వికెట్ పడిపోతోంది. సింగిల్స్ అంతా ఫ్యామిలీ లైఫ్ లో అడుగుపెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి.  ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతాడా అని డిస్కషన్లు పెడుతున్నారు. 

రానా లవ్ లో ఉన్నానని ఎనౌన్స్ చేయడం, ఆ తర్వాత రెండు రోజులకే నిఖిల్ పెళ్లి పీటలెక్కడంతో టాలీవుడ్ లో పెళ్లి సందడి మొదలైంది. బ్యాచిలర్ బాబులు ఈ లాక్ డౌన్ ను వెడ్ లాక్ గా మార్చుకున్నారు. ఇది చూసి ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయని టాలీవుడ్ జనాలంతా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

టాలీవుడ్ బ్యాచిలర్ క్లబ్ లో  ఈ ఏడాది మూడు వికెట్టు పడ్డాయి. నితిన్ ఈ నెల 26న  షాలినీతో కలిసి ఏడు అడుగులు వేయబోతున్నాడు. నిఖిల్, పల్లవి వర్మ జోడీ ఒక్కటయ్యింది. ఇక రానా మిహికా బజాబ్ తో లవ్ స్టోరీని రివీల్ చేశాడో లేదో సురేశ్ బాబు అయితే ఆగస్ట్ లో రానా పెళ్లి అని చెప్పాడు. 

బాహుబలి సమయంలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ప్రభాస్, రానా ఇద్దరూ ఒకే ఆన్సర్ ఇచ్చారు. మహిష్మతి సామ్రాజ్యం నుంచి బయటపడిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తామని చెప్పారు. అయితే బాహుబలి 2 నుంచి బయటపడిన మూడేళ్లకు రానా తనకు కాబోయే బెటర్ హాఫ్ ని పరిచయం చేశాడు. మరి ప్రభాస్ ఎప్పుడు ఇలాంటి గుడ్ న్యూస్ చెబుతాడని జనాలంతా మాట్లాడుకుంటున్నారు. 

ప్రభాస్ సినిమాల గురించి, ఫస్ట్ లుక్, వాటి కలెక్షన్ల గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో.. అతని పెళ్లి గురించి అంతకంటే ఎక్కువే మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ప్రభాస్ ఫలానా సినిమా ఫ్యామిలీ అమ్మాయికి రింగ్ తొడగబోతున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ మాత్రం ఇంకా ఫ్యామిలీ లైఫ్ గురించి ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. సినిమాలతోనే గడుపుతున్నాడు. 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. బ్యాచిలర్ లైఫ్ లోసల్మాన్ ఖాన్ కు పోటీ ఇస్తోన్న ఈ హీరో ఎప్పుడు ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేస్తాడా అని జనాలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోల్డంత ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ డార్లింగ్ లైఫ్ లోకి రాబోయే అమ్మాయి ఎవరా అని టీటౌన్ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: