వరుణ్ తేజ్ సినిమాలో కన్నడ స్టార్..!
మెగా ఫ్యాన్స్ అండ ఉంది కదా మనం ఎలాంటి సినిమా చేసినా వర్క్ అవుట్ అవుతుంది అన్న ఆలోచనతో కాకుండా కొత్త కథలతో మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉండాలని భావిస్తున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ముకుంద నుండి గద్దలకొండ గణేష్ వరకు వరుణ్ తేజ్ కెరియర్ గ్రాఫ్ చూస్తే మెగా హీరో టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం బాక్సర్ అవతారమెత్తిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో తెరకెక్కుతున్న బాక్సర్ (వర్కింగ్ టైటిల్) సినిమాలో వరుణ్ తేజ్ మాస్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. కన్నడలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే ఉపేంద్ర. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఉపేంద్ర తెలుగు స్ట్రైట్ సినిమాలతో కూడా మెప్పించాడు.
ఇక లేటెస్ట్ గా వరుణ్ తేజ్ బాక్సర్ సినిమాలో ఉపేంద్ర ఫాదర్ రోల్ లో నటిస్తున్నారట. చేసేది తండ్రి పాత్రే అయినా వరుణ్ తేజ్ కు ఈక్వల్ రోల్ అని అంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా ఉపేంద్ర నటించారు. ఆ సినిమాలో కూడా తన మార్క్ నటనతో ఆకట్టుకున్న ఉపేంద్ర వరుణ్ తేజ్ బాక్సర్ లో కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తారని అంటున్నారు. రొటీన్ కు భిన్నంగా సినిమా సినిమాకు కొత్తగా ప్రయత్నిస్తున్న వరుణ్ తేజ్ బాక్సర్ గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. బాబాయ్ పవర్ స్టార్ తర్వాత బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ పవర్ స్టార్ సినిమా రేంజ్ హిట్టు కొడతాడో లేదో చూడాలి.