బిచ్చగాడు-2 ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలడా..!
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా చేసిన బిచ్చగాడు సినిమా ఊహించని రేంజ్ లో సక్సెస్ అయ్యింది. తెలుగులో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 50 లక్షల డబ్బింగ్ హక్కులను తీసుకుని రిలీజ్ చేసిన ఈ సినిమా 10 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది చాలా చోట్ల ఈ సినిమా 100 రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి. కథ, కథనాలతో పాటుగా విజయ్ ఆంటోని నటా సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.
ముఖ్యంగా ఈ సినిమా మాస్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. మల్టీప్లెస్ లో కన్నా బి, సి సెంటర్స్ లో ఈ సినిమాను బాగ ఆదరించారు. సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ కూడా మాస్ ఆడియెన్స్ రావడం విశేషం. ఇక బిచ్చగాడు ఇచ్చిన ప్రోత్సాహంతో విజయ్ ఆంటోని తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే సినిమాలైతే వస్తున్నా ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేదు. ఇక లేటెస్ట్ గా విజయ్ సూపర్ హిట్ మూవీ బిచ్చగాడు సీక్వల్ ఎనౌన్స్ చేశాడు.
బిచ్చగాడు 2 పోస్టర్ తో సర్ ప్రైస్ చేశాడు విజయ్ ఆంటోని. ఈ సినిమా పోస్టర్ లో జన సమూహంలో విజయ్ ఆంటోని వాళ్లకు ఏదో స్పీచ్ ఇస్తున్నట్టుగా ఉంది. తప్పకుండా బిచ్చగాడు 2 కూడా అంచనాలను అందుకునేలా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతున్నారు. అయితే బిచ్చగాడు మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అన్నదే డౌట్. బిచ్చగాడ్ సినిమా సూపర్ హిట్ అవడంతో అంతకుముందు విజయ్ ఆంటోని నటించిన సినిమాలు కూడా వెతికి మరి చూశారు తెలుగు ఆడియెన్స్. మొత్తానికి తమిళ హీరో విజయ్ ఆంటోని మరోసారి తెలుగులో సత్తా చాటాలని చూస్తున్నాడు.