ప్రభాస్ తర్వాత రాజమౌళి ఫోకస్.. ఎన్టీఆర్ పైనేనే?

Murali

ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమా కథలన్నీ పాన్ ఇండియా తరహాలోనే రాస్తున్నారు మన రచయితలు, దర్శకులు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ సినిమాలన్నీ తెలుగులోనే తెరకెక్కాయి. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీతో బాలీవుడ్ కి కూడా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. బాహుబలితో ప్రభాస్ ఒక్కసారిగా నేషనల్ వైడ్ స్టార్ కావడానికి రాజమౌళి ప్రొజెక్ట్ చేసిన విధానం కూడా తోడయింది.

 

ప్రస్తుతం ఎన్టీఆర్ కు పాన్ ఇండియా గుర్తింపు రావడం అవసరం. ఎన్టీఆర్ తో పాటు ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్ గతంలోనే బాలీవుడ్ కి పరిచయమయ్యాడు. ‘జంజీర్’ సినిమాతో కొన్నేళ్ల క్రితమే డైరక్ట్ సినిమా చేశాడు. కాబట్టి.. చరణ్ కు కొంత గుర్తింపు ఉంది. పైగా బాలీవుడ్ లో సైరా విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు బాలీవుడ్ లో క్రేజ్ అవసరం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు పులితో ఫైట్ ఉందని వార్తలు వచ్చాయి. రామ్ చరణ్ ఎన్టీఆర్ పాత్రలు సమస్థాయిలో ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ప్రత్యేకించి ఎన్టీఆర్ బాలీవుడ్ లో ప్రొజెక్ట్ కావాల్సి ఉంది. ఎన్టీఆర్ ఎనర్జీతో అదేమంత కష్టం కాదు.

 

రాజమౌళి టేకింగ్ కూడా ఎన్టీఆర్ కు ప్లస్ కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియాల లెవల్లోనే రెడీ కాబోతున్నాయి. త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులన్నీ ఇలానే తెరకెక్కుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ కీలకం కానుంది. దాదాపు డబ్బై శాతం షూటింగ్ పూర్తైన ఆర్ఆర్ఆర్ కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ప్రారంభం కానుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: