అఖిల్ ను పెళ్లి చేసుకోవాలన్న కోరికను బయటపెట్టిన యాంకర్ షాక్ అయిన నాగార్జున !

Seetha Sailaja

నాగార్జున నట వారసుడుగా ఎదగాలని అఖిల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ప్రయత్నంలోనూ అతడికి పరాజయమే ఎదురౌతోంది. లేటెస్ట్ గా ఎన్నో ఆశలు పెట్టుకుని అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ విడుదల కాకుండా కరోనా అడ్డు తగులుతోంది.


ఇలాంటి పరిస్థితులలో కొనసాగుతున్న అఖిల్ దురదృష్టం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం. దీనికితోడు అఖిల్ ఒకసారి ప్రేమ విషయంలో కూడ విఫలం అయ్యాడు. అయినప్పటికీ నాగార్జున ఇస్తున్న ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో పరుగులుతీస్తున్న అఖిల్ ను పెళ్ళి చేసుకోవడమే తన జీవిత ధ్యేయం అంటూ ఒక యాంకర్ అఖిల్ కు తన ఓపెన్ లవ్ ప్రోపోజల్ బయట పెట్టింది. ఆ యాంకర్ పేరు విష్ణుప్రియ.


విష్ణుప్రియ‌ కు ‘పోరా పోవే’ ప్రోగ్రామ్ హోస్ట్ గా మంచి పేరు వచ్చింది. ఈమెకు యూత్ లో కూడ మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు హాట్ ఫోటో షూట్స్ చేస్తూ తరుచూ ఈమె సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. ఈమె మరో హాట్ యాంకర్ శ్రీముఖి కి అత్యంత సన్నిహితురాలు ఈమధ్య వీరిద్దరూ కలిసి యాంకర్ ఝాన్సీ హోస్ట్ చేస్తున్న ఒక షోకు వచ్చారు. ఈ సందర్భంలో ఝాన్సీ విష్ణుప్రియకు సంబంధించిన ఒక సీక్రెట్ చెప్పమని శ్రీముఖిని అడిగింది.


వెంటనే శ్రీముఖి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన స్నేహితురాలైన విష్ణుప్రియకు సంబంధించిన సీక్రెట్‌ ను బ‌య‌టికి చెప్పింది. విష్ణుప్రియకు అక్కినేని అఖిల్ అంటే ఎంతో ఇష్టం అని దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమని అడిగితే.. అఖిల్‌ని పెళ్లి చేసుకుంటానని అడుగుతుందని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు విష్ణుప్రియ చేతి పై అఖిల్ టాటూ కూడా ఉంది అన్న సీక్రెట్ కూడా బయటపెట్టింది. ఇప్పుడు ఆమె కోరిక అందరికీ తెలియడంతో కొందరు నాగార్జున పెద్దకోడలు హీరోయిన్ అయితే చిన్న కోడలు యాంకర్ అవుతుందా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: