మళ్లీ బిచ్చగాడు అయిపోతున్న అరవ హీరో..!

frame మళ్లీ బిచ్చగాడు అయిపోతున్న అరవ హీరో..!

NAGARJUNA NAKKA

సినిమాలో అమ్మను బతికించడం కోసం బిచ్చగాడు అవతారం ఎత్తిన విజయ్ ఆంటోనీ.. ఈ సారి సక్సెస్ కోసం మరోసారి బిచ్చగాడుగా మారుతున్నాడు. బిచ్చగాడు తర్వాత విజయ్ కు హిట్ దక్కలేదు. దీంతో బిచ్చగాడు సీక్వెల్ ను నమ్ముకున్నాడు ఈ అరవ హీరో. 


విజయ్ ఆంటోనీ తమిళంలో నటించిన పిచ్చయ్ కారన్ తెలుగులో బిచ్చగాడు అనువాదమై పెద్ద విజయం సాధించింది. తమిళం కంటే తెలుగులో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో 18కోట్ల షేర్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది. 


బిచ్చగాడు తీసుకొచ్చిన క్రేజ్ తో తర్వాతి మూవీ సైతాన్ భారీ అంచనాలతో రిలీజైంది. దీనికి తగ్గట్టే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అయితే సినిమా ఫైనల్ రిజల్ట్ మాత్రం ఫ్లాపే. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ ఈ ఐదేళ్లలో ఆరు సినిమాల్లో నటించినా.. సక్సెస్ రాలేదు. దీంతో తనకు క్రేజ్ తీసుకొ్చ్చిన బిచ్చగాడు సీక్వెల్ లోనే నమ్ముకున్నాడు. 

 

బిచ్చగాడును శశి డైరెక్ట్ చేయగా సీక్వెల్ దగ్గరకొచ్చేసరికి డైరెక్టర్ ఛేంజ్ అయ్యారు. లేడీ డైరెక్టర్ ప్రియ కృష్ణ స్వామి దర్శకురాలిగా ఎంచుకున్నాడు. ఆమె గతంలో డైరెక్టర్ తీసిన సినిమా బారమ్ తమిళ ప్రాంతీయ ఉత్తమ చిత్రం జాతీయ అవార్డు అందుకుంది. విజయ్ ఆంటోనీ బర్త్ డే సందర్బంగా బిచ్చగాడు 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సీక్వెల్ కూడా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతుందా.. లేదంటే మరో కోణంలో వెళ్తుందో చూడాలి.  

 

మొత్తానికి విజయ్ ఆంటోనీ మరోసారి బిచ్చగాడుగా మారుతున్నాడు. తల్లి కోసం కొడుకు పడే తపన ఆ సిినిమాలో ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంది. మరి బిక్షగాడు 2లో విజయ్ ఆంటోనీ ఏ విధంగా ఆడియన్స్ ను మెప్పిస్తాడో చూడాలి. 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: