ఏ ఆర్ రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు !
ఏఆర్ రెహ్మాన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఎప్పుడూ చాలా ప్రజెంట్ గా కనిపించే రెహ్మాన్ మొదటిసారి విమర్శలు చేశాడు. మ్యూజిక్ తోనే ఎక్కువగా మాట్లాడే రెహ్మాన్, ఈ సారి మాత్రం బాలీవుడ్ పై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. బీటౌన్ లో గ్యాంగులున్నాయని.. అవి కెరీర్ కు కొంతమంది కెరీర్ కు అడ్డుపడుతున్నాయని విమర్శించాడు ఆస్కార్ విన్నర్.
బాలీవుడ్ లో గ్యాంగ్స్ ఉన్నాయని.. ఈ గ్యాంగ్స్ లో కలవని వాళ్లకు కెరీర్ లేకుండా చేస్తారని కంగనా రనౌత్ లాంటి వాళ్లు చాలా రోజులుగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రెహ్మాన్ కూడా ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. నాకు వ్యతిరేకంగా గ్యాంగ్స్ ఉన్నాయని కామెంట్ చేశాడు.
స్లమ్ డాగ్ మిలినీయర్ తో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు ఏఆర్ రెహ్మాన్. వరల్డ్ క్లాస్ మ్యూజిక్ తో మెప్పించే ఈ మ్యూజీషియన్ కొన్నాళ్లుగా స్లో అయ్యాడు. బాలీవుడ్ లో ఇంతకుముందులా వరుస సినిమాలు చేయడం లేదు. దీని గురించే రెహ్మాన్ ని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది మీడియా. దీనికి షాకింగ్ రిప్లై ఇచ్చాడు రెహ్మాన్. నాకు అవకాశాలు తగ్గించడానికి కొన్ని గ్యాంగ్స్ పనిచేస్తున్నాయని విమర్శించాడు.
ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన దిల్ బెచారా సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఈ సందర్భంగా జరిగిన ఇంటరాక్షన్ లో ఈ కామెంట్స్ చేశాడు రెహ్మాన్. ఈ మూవీ డైెరెక్టర్ ముఖేష్ చాబ్రానే రెహ్మాన్ కు ఈ విషయం చెప్పాడట. దిల్ బెచారాకు రెహ్మాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలనుకున్నప్పుడు మఖేష్ ను చాలా మంది అడ్డుకున్నారు. రెహ్మాన్ వద్దని చెప్పారట. ఆ గ్యాంగ్సే ఇన్నాళ్లు ఆస్కార్ విన్నర్ కు వచ్చే అవకాశాలకు అడ్డుపడ్డారని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఏఆర్ రెహ్మాన్ చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.