వావ్.. ఇంట్లోనే ఉండి కరోనాను జయించిన తమిళ హీరో..!
కరోనా మహమ్మారి అతి సామాన్యుడు నుండి బడా స్టార్ల వరకు ఎవరినీ వదిలి పెట్టకుండా పట్టి పీడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ రాజకీయ వేత్తలు కరోనా మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగించే విషయమే. విలాసవంతమైన భవనాలలో ఉంటూ ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వారికే కరోనా వైరస్ సోకిందంటే సామాన్య ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారంటే రాష్ట్రంలో కరోనా ఉధృతి తీవ్రస్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కరోనా తో చనిపోయేవారు కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ మందే ఉన్నారు. అయితే కరోనా బాధితులు ఎక్కువ సంఖ్యలో రికవర్ అవ్వడం సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు.
Yes it’s True, my Dad was tested Positive, by helping him I had the same symptoms of High Temperature, Cold, Cough & was the same for my Manager.
All of us took Ayurvedic Medicine & were out of Danger in a week’s time. We are now Hale & Healthy.
Happy to Share this....GB — vishal (@VishalKOfficial) July 25, 2020
ఒక వారం క్రితం తమిళనాడు లో నివసించే హీరో విశాల్ కి, అతని తండ్రి జీకే రెడ్డికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిజానికి తండ్రి జీకే రెడ్డికి కరోనా వైరస్ లక్షణాలు తొలిసారిగా కనిపించాయి. అయితే అతనికి సహాయకుడిగా ఉన్నందుకు విశాల్ కూడా జ్వరం, జలుబు, దగ్గు బారిన పడ్డాడు. దీంతో చెకప్ చేయించుకోవడం తో వారికి కూడా కరోనా వైరస్ ఉందని పరీక్షల్లో నిర్ధారణ అయింది. విశాల్ మేనేజర్ కి కూడా కరోనా వైరస్ సోకింది. అయితే వీళ్లెవరూ ఆసుపత్రిలో జాయిన్ అవ్వకుండా ఇంట్లోనే ఉంటూ వారం రోజుల పాటు ఆయుర్వేద మందులు వాడి కొవిడ్-19 వ్యాధి నుండి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియపరిచారు హీరో విశాల్.
"అవును... ఇది నిజం. మా నాన్నకి కరోనా పాజిటివ్ అని టెస్ట్ లో తేలింది. తనకి సహాయం చేసినందుకు గాను నాలో కూడా హై టెంపరేచర్, జలుబు, దగ్గు లక్షణాలు కనిపించాయి. నా మేనేజర్ కి కూడా అవే లక్షణాలు బయట పడ్డాయి. మేమందరం ఆయుర్వేద మందులు వాడి కేవలం ఒక్క వారం లోనే ఈ ప్రమాదం నుండి బయట పడగలిగాం. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో మేము ఉన్నాము. ఈ విషయం మీకు తెలియజేస్తున్నందుకు సంతోషంగా ఉంది", అని విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.