వాడు మోసం చేసాడు.. కనిపిస్తే పళ్ళు రాలిపోతాయి : సింగర్ సునీత

praveen
మామూలుగా సినీ సెలబ్రిటీల కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ గుర్తింపును క్యాష్ చేసుకుని కొంత మంది సినీ సెలబ్రిటీల పేరుతో మోసాలకు పాల్పడే ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి సంచలనం సృష్టించాయి. సిని  సెలబ్రిటీల పేర్లు వాడుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ... జనాల్ని బురిడీ కొట్టించే వారు ఎక్కువవుతున్నారు ఈ మధ్యకాలంలో. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి, ఎంతోమంది సినీ  సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులను ఎన్నో ఎదుర్కొన్నారు. తాజాగా టాలీవుడ్ నేపథ్య గాయని సునీతకి  కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. చైతన్య అనే వ్యక్తి తాను సింగర్ సునీత మేనల్లుడిని అంటూ చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇదే మాయ మాటలు చెబుతూ ఎంతో మందిని బురిడీ కొట్టించడం మొదలుపెట్టాడు.


 సినిమా అవకాశాలు ఇప్పిస్తానని లేదా ఇతర మాయమాటలు చెప్పి ఎంతో మందిని మోసం చేస్తున్నాడు. ఇక ఈ విషయం సింగర్ సునీత వరకు వెళ్ళింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందించింది సునీత. తనకు మేనల్లుడు ఎవరూ లేరని... అంతేకాకుండా చైతన్య అనే వ్యక్తి తో తనకు పరిచయం కూడా లేదని దయచేసి ఇలాంటివి నమ్మి మోసపోకండి అంటూ తెలిపింది సునీత. అనంతపురానికి చెందిన చైతన్య అనే వ్యక్తి తన మేనల్లుడు ని అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడని క్లారిటీ ఇచ్చిన  సునీత... ఎంతోమంది సెలబ్రిటీల దగ్గర తన పేరు చెప్పి పరిచయాలు పెంచుకున్నాడు అన్న విషయం తన దగ్గరికి వచ్చింది అంటూ తెలిపింది.



 తన పేరుతో ఎంతో మందికి మాయమాటలు చెప్పి అవకాశాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు  అనే విషయం కూడా తెలిసి తాను షాక్ కి  గురైనట్లు తెలిపింది. వాడెవడో  నాకు  తెలియదు..  కనిపిస్తే పళ్ళు రాలిపోతాయి.. అంటూ వార్నింగ్ ఇచ్చింది సునీత. దీనిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను అంటూ చెప్పింది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: