యుక్తవయసులో కూరగాయలు అమ్మిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటగా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు. కానీ తన వదిన సలహాతో హీరోగా అరంగేట్రం చేయాలని నటనపై శిక్షణ తీసుకునేందుకు సత్యానందం మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యారు పవర్ స్టార్. సత్యానందం మాస్టారు వరుణ్ తేజ్, మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చారు. ఐతే పవన్ కళ్యాణ్ సత్యానందం ఏది చెబితే అది వినేవారు. రోజులో 18 గంటల పాటు నటన గురించే మాట్లాడేవారు. పవన్ కి మంచి వ్యక్తిత్వము ఉందని సత్యానందం మాస్టర్ ఇటీవల తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెన్నై మహానగరంలో 30 రోజుల పాటు నటనపై శిక్షణ ఇచ్చిన సత్యానందం మాస్టర్ ఆ తర్వాత అతడిని విశాఖపట్నానికి తీసుకు వచ్చారు అట. నటనపై క్లాసులు చెప్పినంత కాలం పవన్ కళ్యాణ్ అతను ఒకే రూమ్ లో ఉండేవారట. ఆహారం విషయంలో పవన్ కళ్యాణ్ అంత కఠినంగా ఉండకుండా ఏది దొరికితే అది తినేవారట. ఒక నటుడిగా తీర్చిదిద్దడానికి పవన్ కళ్యాణ్ లో అన్ని అర్హతలు ఉన్నాయని సత్యానందం మాస్టర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ నచ్చని పనులకు, నచ్చని వ్యక్తులకు చాలా దూరంగా ఉంటారట.
ఐతే పవన్ కళ్యాణ్ నటనలో నైపుణ్యం సాధించి వెండితెరపై హీరోగా నటించగల అనే సందేహం మెగాస్టార్ కుటుంబం లో ఎక్కువగా ఉండేదట. కానీ పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలతో తన నటనా శిక్షణ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పనిచేసేవారట. తలపాగా ధరించండి అని చెప్పడమే ఆలస్యం అతను తలపాగా పెట్టుకునేవాడు. పంచ కట్టుకోమనగానే కట్టుకునేవారు. అలాగే క్లీన్ షేవ్ చేసుకున్న చేసుకునేవారు. ఒక సమయంలో సత్యానందం మాస్టర్ పవన్ కళ్యాణ్ చేత కూరగాయలు అమ్మించారట. అయితే కూరగాయలు అమ్మండి, పవన్ కళ్యాణ్ గారు! అని చెప్పగానే... అతను ఏ మాత్రం సందేహించకుండా వెంటనే కూరగాయలు అమ్మడం ప్రారంభించారట. ఇది చూసి పవన్ కళ్యాణ్ లో చాలా డెడికేషన్ ఉందని అర్థమైన సత్యానందం మాస్టారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట.