ఆయన ఆశయం నాలో స్ఫూర్తిని నింపిందంటున్న డైలాగ్ కింగ్...!
నేడు డైలాగ్ కింగ్ సాయికుమార్ జన్మదినం. అయితే ఆయన జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీ సంతోష్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే మనం పలు రోజుల నుంచీ చూస్తూనే ఉన్నాం రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అయితే ఇప్పటికే పలు సినిమా యాక్టర్లు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. అయితే సమాజం పట్ల ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరిని ఈ చాలెంజ్ కదిలిస్తోంది.
జూలై 27న టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ జన్మదినం సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించారు. అయితే ఎంపీ సంతోష్ ఆశయం తనకు స్ఫూర్తి నింపిందని సాయి కుమార్ చెప్పారు. మొక్కలు నాటిన తర్వాత సాయికుమార్ “అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీంı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీıı అని శ్లోకం చదివారు.
ఒక రావిచెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మారేడు చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాదీఫల చెట్లు, ఐదు మామిడి చెట్లు, పది పూల చెట్లు నాటిన వాడు నరకానికి వెళ్ళడు అంటుంది శ్రీ వరాహ పురాణం అని సాయి కుమార్ చెప్పారు. అయితే మూడు మొక్కలు నాటి నీకే కాదు మరో ముగ్గురికి ప్రాణ వాయువుని ఇవ్వి అంటోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.
సాయి కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. సాయి కుమార్ తో పాటు తన తనయుడు హీరో ఆది, కూతురు అల్లుడు డాక్టర్ జ్యోతిర్మయి కృష్ణ దంపతులు, సాయి కుమార్ సతీమణి సురేఖ, కోడలు అరుణ, మనవరాలు అయాన కూడా మొక్కలు నాటారు.