ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వాట్సాప్ సంభాషణ..!

Suma Kallamadi

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ బయోపిక్ లో కథానాయకుడి పాత్రలో నటించి భారత దేశ ప్రజలందరికీ సుపరిచితమయ్యారు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోని పాత్రలో అద్భుతంగా జీవించేసి తన నటనా ప్రతిభతో యావత్ భారత దేశ ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశారు. అయితే అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ కలిగి ఉన్న సుశాంత్ సింగ్ కేవలం 34 సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకోవడంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. చాలామంది సినీ అభిమానులు అతని మరణాన్ని జీర్ణించుకోలేక పోయారు. కొంతమంది వీరాభిమానులు ప్రశాంత్ మరణ వార్తను తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ప్రశాంత్ మరణాన్ని అతని రక్త సంబంధీకులు కూడా అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. 


ముఖ్యంగా అతనిని తన సొంత బిడ్డ లాగా ప్రేమించే అక్క శ్వేతా సింగ్ కీర్తి శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడితో జూన్ పదవ తేదీన చేసిన వాట్సాప్ సంభాషణల యొక్క స్క్రీన్ షాట్స్ షేర్ చేసి బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ వాట్సాప్ సంభాషణలో అక్క శ్వేతా సింగర్ కీర్తి తన తమ్ముడిని అమెరికా రావాలంటూ కోరుతునట్టు కనిపించండి. కాగా ఈ వాట్సాప్ చాట్ యొక్క స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తన తమ్ముడు చనిపోయాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదని ఒక పీడకలలా ఉందని శ్వేతా సింగ్ సోషల్ మీడియా వేదికగా చాలా భావోద్వేగానికి గురయ్యారు. 


కైపోచే, కేదార్నాథ్, పీకే వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సుశాంత్ సింగ్ చివరిసారిగా దిల్ బేచారా సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఇటీవల విడుదలైంది. సినిమా చూసేందుకు పైసా కూడా చెల్లించనక్కర్లేదని హాట్ స్టార్ తెలిపింది. ప్రస్తుతం చిత్రాన్ని చూస్తున్నా కోట్ల మంది సినీ ప్రేక్షకులు సుశాంత్ కోసమే ఈ చిత్రాన్ని చూశామని... అతనిని చాలా మిస్ అవుతున్నాం అంటూ బాగా ఎమోషనల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: