శృతి హాసన్ కు లైఫ్ అండ్ డెత్ పరిస్థితి !
శృతి హాసన్ కు బోల్డంత బ్యాక్ గ్రౌండ్ ఉంది. కమల్ హాసన్ కూతురిగా ఇండియా వైడ్ పాపులారిటీ ఉంది. బోల్డ్ హీరోయిన్ అనే ఇమేజ్ కూడా ఉంది. అయితే ఎంత పాపులారిటీ ఉన్నా.. సరైన సక్సెస్ లేక కష్టాల్లో పడింది. లైఫ్ అండ్ డెత్ పరిస్థితిని ఫేస్ చేస్తోంది శృతి హాసన్.
శృతిహాసన్ సరైన సక్సెస్ చూసి చాలా రోజులవుతోంది. ప్రేమమ్ తర్వాత ఈ బ్యూటీకి ఒక్క హిట్ కూడా పడలేదు. దీనికి తోడు బాయ్ ఫ్రెండ్ మైఖేల్ ని పెళ్లి చేసుకునేందుకు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 2017 నుంచి సినిమాలు పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ గురించి ప్లాన్ ఇచ్చింది. కానీ పెళ్లి కోసం కెరీర్ ను పక్కనపెడితే.. ఆ పెళ్లి జరుగలేదు.. కెరీర్ పోయింది.
శృతిహాసన్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాక వెయిట్ పెరిగింది. కాటమరాయుడు సమయంలో అయితే శృతి చాలా లావుగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. ఈ పెరిగిన బరువు, పెళ్లి కోసం తీసుకున్న బ్రేక్ తో కెరీర్ కు బ్రేకులు పడ్డాయి. అయితే పర్సనల్ లైఫ్ లో వచ్చిన ఒడిదుడుకులను ఓవర్ కమ్ చేయడానికి మళ్లీ సినిమాల్లోకి వస్తోంది శృతిహాసన్. తెలుగు, హిందీ సినిమాలు చేస్తూ కెరీర్ ను పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది.
శృతిహాసన్ విద్యుత్ జమాల్ తో కలిసి నటించిన యారా సినిమా జూలై 30న రిలీజ్ అవుతోంది. థియేటర్ లు షట్ డౌన్ లో ఉండటంతో యారాని డైెరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో రవితేజతో కలిసి నటిస్తోన్న క్రాల్ సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ తో బ్రేకులు పడ్డాయి. సో ఓటీటీలో వస్తున్న యారాని పక్కనపెడితే.. క్రాక్ రిజల్ట్ శృతికి క్రూషియల్ అని చెప్పాలి. మరి ఈ మూవీస్ తో శృతి కెరీర్ మళ్లీ ట్రాక్ లోకి వస్తుందా అనేది చూడాలి.