సమంత అక్కినేని శరీరంపై ఉన్న టాటూలు ఇవే..!

Suma Kallamadi

ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమంత ప్రస్తుతం దక్షిణ భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉత్తమ నటీమణిగా దూసుకెళ్తున్నారు. అక్కినేని నాగచైతన్య ను ప్రేమ వివాహం చేసుకున్న సమంత తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో సంతోషకరంగా గడుపుతున్నారు. చాలామంది నటీనటులు లాగానే సమంత అక్కినేని కూడా తన శరీరంపై టాటూలు వేయించుకున్నారు. సమంత తన 18 ఏళ్ళ వయసులో తొలిసారిగా తన శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నారు. తన 18 ఏళ్ళ వయసులో ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని... అందుకే అతని గురించి తన శరీరం పైన పచ్చబొట్టు పొడిపించుకున్నానని సమంత ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 

 

ఈ టాటూని మినహాయించి సమంత తన శరీరంపై 3 టాటూలను వేయించుకున్నారు. తన మణికట్టుకి కొంచెం కింది భాగంలో 'వికింగ్ సింబల్' టాటూ ని వేయించుకున్నారు సమంత. ఈ ప్రపంచంలో మీ వాస్తవికతను తయారు చేసుకోండి అని ఈ టాటూ యొక్క అర్థం. నాగచైతన్య కూడా సమంతా లాగానే తన మణికట్టుపై ఇదే టాటూని పొడిపించుకున్నారు. కానీ తర్వాత తమ వివాహ తేదీ(6-10-17)గా ఆ టాటూని మార్చేసుకున్నారు. 

2019 వ సంవత్సరం లో సమంత అక్కినేని తన పక్కటెముకల పై పొడిపించుకున్న టాటూ ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి ఇది తన భర్త నాగచైతన్య పేరు అని వెల్లడించారు.

సమంతా తన వెనుక భాగంలో మెడ కింద YMC అనే పదాన్ని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. దీని అర్థం ఏ మాయ చేశావే కాగా... అది తన మొట్ట మొదటి హిట్ సినిమా కావడంతో ఆమె గుర్తుగా ఆ సినిమా పేరు టాటూ గా వేయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: