K.G.F-2 అధీరా ఫస్ట్ లుక్.. సంజూ చించేశాడుగా..!

shami

కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ కె.జి.ఎఫ్ సినిమా కేవలం కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ గా నిలిచింది. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో యశ్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో యశ్ కు కన్నడలోనే కాదు సౌత్ అంతా సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా చాప్టర్ 2 ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. 

 

కె.జి.ఎఫ్ సూపర్ హిట్ అవడంతో పార్ట్ 2మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండేలా తీస్తున్నారట. కె.జి.ఎఫ్ చాప్టర్ 2లో విలన్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో అధీర పాత్రలో సంజూ భాయ్ నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబందించిన ప్రీ లుక్ అప్పట్లో సంచలనం సృష్టించగా లేటెస్ట్ గా సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా ఈరోజు అధీర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

 

భయంకరమైన విలన్ గా అధీర లుక్ లో సంజూ చించేశాడని చెప్పొచ్చు. పాత్రకు తగిన గభీర్యం కనిపిస్తుంది. ఫస్ట్ లుక్కే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నారు. యశ్ తో సంజయ్ ఢీ కొడితే బాక్సాఫీస్ బద్ధలు కావాల్సిందే. కె.జి.ఎఫ్ పార్ట్ 1 250 కోట్లు వసూళు చేయగా అదే బడ్జెట్ తో తెరకెక్కే ఈ పార్ట్ 2 ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: