మహేష్ - పవన్ : ఒకరి గురించి మరొకరు ఏమంటారంటే .....??
మొదట, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మెగాస్టార్ సోదరుడిగా సినీ రంగప్రవేశం చేసి, వరుసగా సినిమాలతో సక్సెస్ లు అందుకుంటూ, వాటితో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోంగ్ దక్కించుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందరో అభిమానులను సంపాదించారు. రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్, చిన్నతనంలో పలు సినిమాల్లో నటించారు. ఇక హీరోగా నటించిన ఫస్ట్ సినిమా తోనే బెస్ట్ హిట్ అందుకున్న మహేష్, ఆ తరువాత తనకు వచ్చిన సినిమా అవకాశాలను సక్సెస్ లు గా మలుచుకుని ఎందరో ప్రేక్షకుల, అభిమానుల గుండెల్లో గొప్ప స్థానాన్ని సంపాదించారు.
ఇక టాలీవుడ్ లో మంచి స్నేహితులైన ఈ ఇద్దరూ, ఒకరి గురించి మరొకరు ఏమంటారంటే, తనకు అర్జున్ సినిమా పైరసీ విషయమై పవన్ కళ్యాణ్ అండగా నిలవడంతో పాటు, కలిసిన పలుసార్లు ఎంతో చక్కగా కలుపుగోలుగా మాట్లాడుతుంటారని మహేష్ అంటూ ఉంటారు. మహేష్ ని తాను పలు సందర్భాల్లో కలిశానని, ఆయన తన తోటివారికి, ముఖ్యంగా పెద్దలకు ఎంతో గౌరవం ఇస్తారని పవన్ అంటూ ఉంటారు. ఇద్దరం కలిసినపుడు ఎంతో సరదాగా పలు విషయాలు మాట్లాడుకుంటామని కూడా చెప్తుంటారు. ఈ విధంగా అంత పెద్ద స్టార్స్, ఒకరి గురించి మరొకరు గొప్పగా చెప్పుకోవడం మన సినిమా ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన పోటీకి నిదర్శనమని అంటారు సినీ విశ్లేషకులు.....!!