ఆ సీన్స్ కు ప్రభాస్ ఫ్యాన్స్  కు, గూస్ బంప్స్ ఖాయమట .....??

GVK Writings
వర్షం, చత్రపతి, మిర్చి సినిమాలతో కమర్షియల్ గా అతి పెద్ద సక్సెస్ లు అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఆ తరువాత టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి రెండు భాగాల సినిమాల విజయాలతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్లో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించి, దానితో పాటు ఎందరో అభిమానులు కూడా సంపాదించారు. ఆ తర్వాత నుండి ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్టులనే అంగీకరిస్తూ వస్తున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన సినిమా సాహో, గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ విజయాన్ని అందుకుంది.


ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. పూజా హెగ్డే హీరోయిన్ గా, అద్భుతమైన ప్రేమకథగా పలు యాక్షన్, ఎమోషనల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు అత్యంత భారీ ఖర్చుతో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్  మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది.


కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్ధ ప్రేమకథను బేస్ చేసుకుని దర్శకుడు రాధాకృష్ణ తీస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని, కాగా వాటికి పలువురు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అగ్రశ్రేణి ఫైట్ మాస్టర్స్ పనిచేశారని, రేపు వెండితెరపై ఆ యాక్షన్, ఫైట్ సీన్స్ ని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా గూస్బంప్స్ రావడం ఖాయం అంటున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నిజంగా అదరగొడితే మాత్రం, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా గొప్ప పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: