ఆ మెగా హీరోని ఓటిటి టెంప్ట్ చేస్తుందా..?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మెగా హీరోల్లో సాయి ధరంతేజ్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి.  గతంలో వరుస ప్లాపులతో సతమతమైన సాయి ధరంతేజ్ చిత్రలహరి సినిమా తర్వాత మళ్లీ ట్రాక్ లో పడ్డాడు. చిత్రలహరితో  మంచి విజయం అందుకోవటం..  ఆ తర్వాత మొన్నటికి మొన్న సాయిధరమ్ తేజ్  హీరోగా నటించిన ప్రతి రోజు పండగే సినిమా కూడా మంచి విజయం సాధించడంతో... సాయి ధరం కెరీర్ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఇటు ప్రేక్షకులు కూడా సాయి ధరంతేజ్ కి ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు.


 ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సాయి ధరంతేజ్ సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సినిమాలోని ఒక పాట కూడా విడుదల కాగా  ఆడియన్స్ ను ఎంతగానో ఆకర్షించింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా సినిమా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఓటిటి ప్లాట్ఫామ్ కి ఎక్కువగా డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే.



ప్రేక్షకుల్లో   కూడా రోజురోజుకు ఓటిటి కి ఆదరణ  పెరిగిపోతుంది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను... థియేటర్లు తీరుచుకోలేదని విడుదల చేయకుండా ఉండకుండా..ఓటిటి వేదికగా  విడుదల చేస్తే ఎంతో బెటర్ అని ప్రస్తుతం నిర్మాతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నో సినిమాలు ఓటిటి లో  విడుదలైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మెగాహీరో సాయిధరమ్ తేజ్  ను కూడా ఓటిటి ఫ్లాట్ ఫామ్స్  ఆకర్షిస్తున్నాయట. దీంతో కొన్ని రోజుల వరకు సినిమా థియేటర్లు తెరుచుకోకపోతే సాయిధరమ్ తేజ్  హీరోగా నటించిన సినిమా కూడా ఓటిటి వేదికగా  విడుదలయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ టౌన్ లో  టాక్ వినిపిస్తోంది.


 ఇప్పటికే ఓటిటి యాజమాన్యాలు  సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తూ చర్చలు  జరుపుతున్నట్లు సమాచారం. త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా ఓటిటీలో విడుదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది  మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: