అనుష్క తో అప్పుడు ఈజీ .... కానీ, ఇప్పుడు మాత్రం కష్టమట .....??

GVK Writings
టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి, మొదట పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన సూపర్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో ఆమె పోషించిన షాషా పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కింది. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సరసన హీరోయిన్ గా ఆమె నటించిన సినిమా విక్రమార్కుడు. అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుంది. అనంతరం వరుసగా సినిమా అవకాశాలతో కొనసాగిన అనుష్క, సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్సకత్వంలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన అంరుధతి సినిమాలో నటించింది.


ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాలోఅనుష్క అద్భుతమైన నటనను కనబరచడంతో పాటు, అప్పట్లో ఈ సినిమా అతి పెద్ద విజయాన్ని అందుకుని ఆమెకు హీరోయిన్ గా గొప్ప పేరుని తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి ఆమెకు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఇటీవల ప్రభాస్ హీరోగా రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ సినిమాల్లో దేవసేన పాత్రలో నటించిన అనుష్క, జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు దక్కించుకున్నారు. కాగా బాహుబలి తరువాత అనుష్క ఒకప్పటి మాదిరిగా సినిమాలు చేయడం తగ్గించారు. అయితే అందుకు ఒక కారణం ఉందని సమాచారం.


కెరీర్ మొదట్లో ఎక్కువగా రొమాంటిక్ గా, సరదాగా సాగె పాత్రలో నటించిన అనుష్క, ఇక పై అటువంటి వాటి కంటే కూడా తాను ఎంచుకునే సినిమాల్లో తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మధ్యలో అక్కడక్కడా వచ్చిన కొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినా, ఆ పాత్రలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించారని,  అందుకే ఇటీవల గడచిన మూడేళ్ళలో ఆమె కేవలం రెండు సినిమాల్లోనే నటించారని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటెస్ట్ సినిమా నిశ్శబ్దం అతి త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆ విధంగా అప్పట్లో అనుష్కకు కథ చెప్పి ఆమెను ఈజీగా ఒప్పించగల దర్శకులకు, ఇప్పుడు అది అంత ఈజీ కాదంటున్నారు .....!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: