రాం చరణ్ 'జన గణ మన'.. పూరి ప్లాన్ అదిరింది..!

shami
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు ఆర్జీవి. ఈ మూవీతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా చరణ్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత రాం చరణ్ మరో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి డైరక్షన్ లో ట్రిపుల్ ఆర్ సినిమాతో నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ తెచ్చుకోవడం ఖాయం. అందుకే ఆ తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట రాం చరణ్.

ఇంతకీ చరణ్ చేయబోయే పాన్ ఇండియా మూవీ డైరక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని తెలుస్తుంది. మెగాస్టార్ తనయుడిగా వెండితెరకు చరణ్ పరిచయమైంది చురుత సినిమాతో. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథే. ఇన్నాళ్ళకు వీరిద్దరు కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. ఆల్రెడీ పూరి తన దగ్గర ఉన్న జన గణ మన సినిమానే చరణ్ తో తీయాలని అనుకుంట్టు తెలుస్తుంది. చరణ్ కు ఆల్రెడీ స్టోరీ చెప్పడం చెర్రి ఓకే అనడం జరిగిందట.  

ఇక మరోపక్క మహేష్ కూడా పూరి వచ్చి కథ చెబుతా అంటే తనకు ఓకే అంటున్నాడు. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ ను మహేష్ కు వినిపించాడు కాని మహేష్ ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ కసితోనే ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఫైనల్ గా చరణ్ తో ఆ సినిమా కన్ఫర్మ్ చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం పూరి చరణ్ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టే లెక్క.

   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: