కియారా ప్రేమ కోసం యంగ్ హీరో తహతహ

NAGARJUNA NAKKA
చూడాలని వుంది అంటే ఓకె. ఇది కామనే. కౌగిలించుకోవాలని ఉందంటే.. ఆలోచించాల్సిన విషయం. విషయం ఏదో నడుస్తుందన్న అనుమానం కలగక మానదు.  కియారా అద్వానీ పుట్టిన రోజున ఓ యంగ్‌ హీరో ప్రేమనంతా కురిపించేశాడు. అసలే ఆ ఇద్దరు ప్రేమలో వున్నారంటూ.. కథనాలు వినిపించాయి. దీనికి తోడు.. ఆ హీరో మెసేజ్ ను కియారా తేలిగ్గా తీసుకుందా. ఏమని రిప్లయ్‌ ఇచ్చింది? కియారా మీద మనసుపడి ఆ కుర్రాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు.

జులై 31న కియారా 28వ ఏట అడుగుపెట్టింది. కేక్‌లో 28 కొవ్వొత్తులను వెలిగించగా.. అభిమానులు.. సహచరులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి రొటీన్‌ విషెస్‌ నుంచి ఓ షాకింగ్‌ మెసేస్‌ వచ్చింది. ఆమె లవర్‌గా ముద్రపడిన సిద్దార్థ్ మల్హోత్రా నుంచి ఆ మెసేజ్‌. సిద్దార్థ తన ఇన్‌స్టాలో కియారా ఫొటో పోస్ట్‌ చేసి.. "నీకు నా ప్రేమ.. కౌగిలింతలు ' అంటూ ప్రేమను కురిపించాడు. ఆల్మోస్ట్‌ ప్రపోజ్‌ చేసినంత పని చేశాడు. ఒకవేళ కరోనా లేకుండా వుంటే... కియారాకు కేక్‌ తినిపించి.. ముద్దు.. కౌగిలింతలు ఇచ్చేసేవాడేమో.

ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారన్న సంగతి బాలీవుడ్‌లో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇదే విషయంపై ఆ మధ్య సిద్దార్థ స్పందిస్తూ.. ఇది నిజమైతే బాగుండన్నాడు. అంటే.. కియారా సిద్దార్థను ప్రేమిస్తుందో లేదో గానీ.. ఈ కుర్రాడు మాత్రం ఈ అమ్మడి ప్రేమలో విహరిస్తున్నాడన్న మాట.

షేర్షా సినిమా షూటింగ్‌లో సిద్దార్థ, కియారా మధ్య పరిచయం ప్రేమగా మారిందట.  ఈ గాసిప్‌ను  ఇద్దరూ ఖండించకుండా..  పుకారుకు బలం చేకూరింది. రీసెంట్‌గా కియారా బర్త్‌డే నాడు.. కౌగిలించుకోవాలని వుందన్న సిద్దార్థ ఆరాటం చూస్తుంటే.. కియారాను ఎప్పుడు పెళ్లి చేసేసుకుని ఫ్యామిలీ పెట్టాద్దామా? అన్న స్పీడ్‌లో వున్నాడు. మొత్తానికి ఆ యంగ్ హీరో సిద్ధార్థ కియారాపై మనసు పారేసుకున్నాడు. మరి కియారా ఆ ప్రేమికుడి యాక్షన్ కు రియాక్షన్ ఇస్తుందో లేదో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: