శ్రీదేవిలా.. జాన్వి మెప్పిస్తుందా..?
కార్గిల్ యుద్థంలో విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథలో జాన్వి టైటిల్ రోల్ పోషించింది. రెండో సినిమాకే నటనలో మెచ్యూరిటీ చూపించే అవకాశం దక్కింది. పైలట్ కావాలనుకున్న అమ్మాయిని సమాజం ఎలా నిరుత్సాహపరిచింది. వాటిని అధిగమించి తనను ఎలా నెవరేచ్చుకుందో ట్రైలర్లో ఆకట్టుకునేలా చూపించాడు దర్శకుడు.
గుంజన్ సక్సేనాలా మేకోవర్ కావడానికి జాన్వీ ఆమెను కలిసి.. ప్రొఫెషన్ల లైఫ్‌లో ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంది. బాడీ లాంగ్వేజ్‌ను అబ్జర్వ్‌చేసి.. ప్రొఫెషనలిజం చూపించింది. అయితే ఈ అమ్మడికి యాక్టింగ్ స్కిల్స్‌కు కరోనా బ్రేకులేసింది. థియేటర్లో రిలీజైతే.. మరింత పేరు వస్తుంది? ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో 100 కోట్లు దాటేయొచ్చని ఆశపడింది జాన్వి. అయితే.. సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడంతో డీలా పడిపోయింది. తన కష్టానికి తగ్గ పేరు వస్తుందా? అన్న భయంతో వుంది జాన్వి. సినిమాను ఆగస్ట్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తున్నారు.
గుంజన్ సక్సేనాలో జాన్వి తండ్రిగా పంకజ్ త్రిపాఠి నటించారు. కూతురును వెన్ను తట్టి ప్రోత్సహించే పాత్రలో పంజక్ నటన ఆకట్టుకుంది. ఒక స్త్రీగానీ.. పురుషుడు గానీ విమానం నడుపుతుంటే.. వారిని పైలెట్ అనే పిలుస్తారన్న డైలాగ్ ట్రైలర్లో బాగా పేలింది. ఈ బయోపిక్కు శరణ్ శర్మ దర్శకుడు. గుంజన్ సక్సేనా... థియేటర్స్‌లోకి రాకపో్యినా.. ఓటీటీలో ఎక్కువ వ్యూవ్స్ రాబట్టి.. పేరు.. క్రేజ్ తీసుకొస్తుందన్న ఆశతో వుంది ఈ నటవారసురాలు. మొత్తానికి శ్రీదేవి కూతురు జాన్విపై ఏదో ఊహించుకుంటున్నారు ప్రేక్షకులు. తల్లిలా ఆమె మెప్పిస్తుందా లేదా అనే సందేహం వాళ్లలో నెలకొంది.