సత్యదేవ్ సక్సస్ కు కారణం ఆమూల సూత్రం !

Seetha Sailaja
ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచిజీతంతో పనిచేస్తూ కేవలం సినిమాల పై ఉన్న మోజుతో ఆఉద్యోగాన్ని వదులుకుని పట్టువదలని విక్రమార్కుడు లా హీరోగా సెటిల్ కావాలని ప్రయత్నిస్తున్న సత్యదేవ్ ప్రయత్నాలకు లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ మూవీ హీరోగా అతడికి మరింత పేరును తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఈ మూవీకి వస్తున్న ప్రశంసలతో మంచి జోష్ లో ఉన్న సత్యదేవ్ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను విజయం సాధించడానికి నమ్మిన సూత్రాన్ని బయటపెట్టాడు.


తనకు ఒక ఇల్లు క్లీన్ చేసే పని ఇస్తే మళ్ళీ తననే పిలిచి ఆ ఇల్లు క్లీన్ చేయమనేంత శ్రద్ధగా తాను పని చేస్తానని సినిమాలలో నటనను కూడ తాను అదేవిధంగా అత్యంత శ్రద్ధతో చేస్తాను కాబట్టి తనకు తన కెరియర్ సక్సస్ పై నమ్మకం ఉంది అని అంటున్నాడు. తాను ఐబిఎమ్ కంపెనీలో పని చేస్తున్నప్పుడు తాను డెవలప్ చేసిన ఒక సాఫ్ట్ వేర్ వల్ల ఆ కంపెనీకి వారానికి 72 గంటలు మ్యాన్ పవర్ సేవ్ అయిన విషయాన్ని బయటపెడుతూ తనకు ఆకంపెనీలో వచ్చిన అనేక ఆఫర్లు వదులుకుని తాను సినిమాల వైపు రావడానికి ప్రధాన కారణం మెగా స్టార్ చిరంజీవి అని అంటున్నాడు.


జీవితంలో సక్సస్ సాధించాలి అని భావించేవాడు ఎప్పుడు కష్టం గురించి మాట్లాడకూడదు అనీ అలా కష్టపడినప్పుడు మాత్రమే విజయం సొంతం అవుతుంది అని చిరంజీవి అనేకసార్లు చెప్పిన మాటలకు ప్రభావితమై తాను చిరంజీవికి ఏకలవ్య శిష్యుడుగా మారానని సత్యదేవ్ అంటున్నాడు. ప్రస్తుతం ధియేటర్లు మూతపడి ఉండటంతో తన ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ తాను ఏమీ బాధపడలేదని నటుడుగా ఎదగాలని కోరిక ఉన్న వ్యక్తికి ఏ ఫ్లాట్ ఫామ్ అయినా ఒకటే అని అంటున్నాడు.


ప్రస్తుతం 5 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈయంగ్ హీరోతో తమన్నా నిత్యామీనన్ లాంటి టాప్ హీరోయిన్స్ కూడ నటిస్తున్నారు. సత్యదేవ్ గొంతు కూడ అతడి కెరియర్ కు ప్లస్ పాయింట్ గా కూడ మారింది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితులలో ఈ యంగ్ హీరోకు మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: