సూపర్ స్టార్ మూవీలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ..!!

Purushottham Vinay
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది, తెలుగురాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది  అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈయన సృష్టించని  రికార్డులు లేవు, కొట్టని కలెక్షన్స్ లేవు. అంతటి క్రేజ్ ని సంపాదించారు.

సినిమా సినిమా కి విభిన్నం చూపిస్తూ వరుసగా విజయాలు సాధిస్తున్నారు. ఈ సంవత్సరం ఆరంభం  లోనే సరిలేరు నీకెవ్వరూ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి  వరుసగా మూడు సార్లూ 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా రికార్డు సృష్టించారు. ఈ సినిమా పక్క మాస్ మూవీగా రిలీజ్ అయ్యి ఏకంగా 130 కోట్లు పైగా షేర్ కలెక్షన్స్ సాధించి మహేష్ బాబుకి హ్యాట్రిక్ హిట్ ఇవ్వడమే కాకుండా మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక తన తదుపరి విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్, పరుశురాం దర్శకత్వం లో సర్కారు వారి పాట అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ప్రీలుక్ పోస్టర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకొని ఎన్ని ప్రకంపనాలు సృష్టించిందో తెలిసిన విషయమే. ఇక ఈ మూవీ లో మొదటి హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నారు. అలాగే రెండవ హీరోయిన్ పాత్ర కు బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేను ఎంపిక చేసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. అనన్య ఇప్పటికే విజయ్ దేవరకొండ పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ మేరకు సర్కారు వారి పాట లో సెకండ్ హీరోయిన్ గా తీసుకోవాలని పరశురామ్ ప్లాన్ చేస్తున్నాడంట. ఈ సినిమా ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కి థమన్ స్వరాల అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: