అబ్బో ..... ఇరువురు భామలతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్ ....??
అతి త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన ఒక యదార్ధమైన ప్రేమకథని బేస్ గా చేసుకుని దర్శకుడు రాధాకృష్ణ దీనిని తెరకెక్కితున్నట్లు చెప్తున్నారు. ఇటీవల సాహూ తో ఆశించిన రేంజ్ విజయాన్ని అందుకోలేకపోయిన ప్రభాస్, ఈ సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో కేవలం పూజా మాత్రమే కాకుండా మరొక హీరోయిన్ కూడా నటిస్తోందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాలేదని, సినిమాలోని సెకండ్ హాఫ్ లో కీలకమైన కొన్ని సీన్స్ లో ఆ హీరోయిన్ కనిపిస్తుందని అంటున్నారు. ఆ పాత్రలో నటించనున్న హీరోయిన్ ని ఇటీవల ఎంపిక చేసిన యూనిట్, తదుపరి జరుగబోయే షూట్ లో ఆమె సీన్స్ తీయనున్నారట. అయితే ఈ విషయాన్ని బయటకు రానీయకుండా ఇప్పటివరకు యూనిట్ ఎంతో జాగ్రత్తపడ్డప్పటికీ, అందులోని కొందరు దీనిని లీక్ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త పై అధికారికంగా ఆ సినిమా యూనిట్ నుండి ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది .....!!