లేటెస్ట్ అప్డేట్ : సూపర్ స్టార్ మహేష్, లోకేష్ కనకరాజు కాంబినేషన్ ఫిక్స్డ్!

Purushottham Vinay
గత ఏడాది తమిళ్ స్టార్ హీరో కార్తీ తో ఖైదీ అనే మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి స్టార్ హీరోల కంట్లో పడ్డాడు లోకేష్ కనకరాజ్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా విడుదల అయ్యి అటు తమిళ్ లో ను ఇటు తెలుగు లోను సూపర్ డూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం. ఏకంగా 100 కోట్ల వసూళ్లనే కొల్లగొట్టింది ఈ చిత్రం. అప్పటికే తమిళ్ లో విజయ్ నటించిన బిగిల్ కి పోటీగా రిలీజ్ అయ్యి ఆ పోటీని తట్టుకొని బిగిల్ కంటే బాగా సక్సెస్ అయ్యింది. ఇక విజయ్ కి కూడా ఈ చిత్రం నచ్చి, ఇంప్రెస్ అయ్యి లోకేష్ కనకరాజు కి అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం లోకేష్ విజయ్ తో మాస్టర్ మూవీ ని చేసాడు. సినిమా పూర్తి అయ్యి చాలా రోజులైనా ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల చిత్రం విడుదల కాలేకపోతుంది. లోకేష్ పనితనం నచ్చి, తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఇతన్ని దర్శకునిగా పెట్టి ఒక బైలింగ్వల్ సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ బైలింగ్వల్ మూవీ ని రామ్ చరణ్ తో తీయాలో, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలో అనే దైలమాలో పడ్డారు నిర్మాతలు.

ఇప్పుడు ఫైనల్ గా తీస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు తో తీయాలని ఫిక్స్ అయ్యారంట. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ మధ్య ఖైదీ సినిమా చూసారు. సినిమా బాగా నచ్చి, ఖైదీ చిత్రబృందాన్ని, లోకేష్ కనకరాజ్ ని, హీరో కార్తీ ని  బాగా అభినందించారు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ కి  ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేసే అవకాశం రావడం తో చాలా హ్యాపీ గా వున్నాడంట.

 గతం లో మహేష్ బాబు పాన్ డైరెక్టర్ మురగదాస్ తో కలిసి స్పైడర్ మూవీ చేశారు. ఇది బైలింగ్వల్ మూవీ. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ మూవీ తమిళ్ లో సూపర్ హిట్ అయింది కాని తెలుగులో క్రిటిక్స్ తప్పుడు రివ్యూ ల వల్ల ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ చాలా బాగున్నా కాని క్రెటిక్స్ తప్పుడు రివ్యూ ల వల్ల తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండోసారి ఈ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కలిసి మరోసారి బైలింగ్వల్ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట మూవీ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: