ఆ ఒక్క మాట చాలు సూపర్ స్టార్ మహేష్ గొప్పతనం ఏంటో చెప్పడానికి ......??
అక్కడి నుండి తన టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకున్న మహేష్ మురారి, ఒక్కడు సినిమాలతో అప్పట్లో సంచలన విజయాలు అందుకుని పెద్ద కమర్షియల్ హీరోగా పేరు, మార్కెట్ సంపాదించారు. అనంతరం మరిన్ని పెద్ద సక్సెస్ లు అందుకున్న సూపర్ స్టార్, ఇటీవల వరుసగా మూడు విజయాలతో హ్యాట్రిక్ అందుకున్నారు. కాగా అతి త్వరలో ఆయన నటించనున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక మొదటి నుండి తనకు సినిమాలు తప్ప వేరే ప్రపంచం అనేది తెలియదని చెప్పే మహేష్ బాబు, పనినే తాను దైవంగా భావిస్తానని అంటుంటారు. తన కెరీర్ లో ఎన్నో మంచి విజయాలతో పాటు మధ్యలో కొన్ని ఊహించని అపజయాలు కూడా వచ్చాయని, అయితే వాటికి మాత్రం పూర్తి బాధ్యత తనదే అని అంటారు మహేష్.
తన సినిమా హిట్ అయితే దాని సక్సెస్ క్రెడిట్ పనిచేసిన వారందరికీ దక్కుతుందని చెప్పే మహేష్, ఒకవేళ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అది పూర్తిగా తన బాధ్యతే అని అంటారు. ఎందుకంటే ఆ సినిమా కథే తాను ఒప్పుకొని ఉండకపోతే అది తెరకెక్కి ఉండేది కాదు కదా, దానిని బట్టి తన జడ్జిమెంట్ తప్పని అంటారు మహేష్. తండ్రి కృష్ణ మాదిరిగా ఆ విధంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరికీ సమాన విలువనిచ్చే మంచి మనస్తత్వం ఉండడం వల్లనే ప్రస్తుతం మహేష్ కు అంత గొప్ప క్రేజ్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు, ప్రముఖులు ....!!