ట్విట్టర్ లో సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ సరికొత్త వరల్డ్ రికార్డు... ఏకంగా గిన్నీస్ రికార్డు కొట్టారు... !!!!

Purushottham Vinay

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ రోజు రోజు కి పెరిగిపోతుంది. నిన్న జరిగిన పుట్టినరోజు కి రికార్డు స్థాయి ట్వీట్ల తో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఏ హీరో అందుకోలేనటువంటి రికార్డు ని మహేష్ అందుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ మరోసారి తామేంటో రుజువు చేశారు. ట్వీట్ల తుఫానుతో మహేష్ బాబు బర్త్ డే టాగ్ ని రికార్డు స్థాయిలో ట్రెండ్ చేస్తూ గిన్నీస్ రికార్డు సృష్టించి సరిలేరు మాకు ఎవ్వరు అని రుజువు చేశారు.



ఇక నిన్న జరిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు రోజు సందర్బంగా ఆయన పుట్టినరోజు టాగ్ ని రికార్డు స్థాయిలో ట్వీట్ లు చేసి , ఏకంగా 60.2 మిలియన్ల ట్వీట్ల తో ఎన్నడూ  కనీ వినీ ఎరుగని రీతి గా ట్రెండింగ్ లో ఉంచారు. ఈ రికార్డు మొట్టమొదటి సారిగా మన ఇండియన్ హీరో అందుకోవడం విశేషం. దీన్ని బట్టి అర్ధం అవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి క్రేజ్ ఏంటో. ఇప్పుడు ఆయన వరల్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గా చరిత్ర సృష్టించారు. ఒక ప్రాంతీయ హీరో కి ప్రపంచ వ్యాప్తంగా ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉండటం మామూలు విషయం కాదు. ఈ ఘనత మన తెలుగు హీరో సాంధించాడు. ట్రెండు స్టార్ట్ అయ్యి మొదటి గంట నుంచే టాప్ లో వుంటూ విధ్వంసం సృష్టించారు సూపర్ ఫ్యాన్స్. ఇక ట్విట్టర్ వేదికగా ఫిల్మ్ ఫేర్ సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్స్ ని అభినందించింది. ఏది ఏమైనా ఒక ప్రాంతీయ హీరో గా అందులోను మన తెలుగు హీరోగా  ఈ ఘనత సాధించినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా చాలా గర్వాంగా వున్నారు. ఈ రికార్డు ట్రెండింగ్ తో మహేష్ బాబు ప్రపంచంలోనే నెంబర్ 1 హీరో అయ్యి పెద్ద సంచలనం సృష్టించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: