కలిసి నటించబోతున్న క్యూట్ హీరోయిన్స్.. !!!!
ఇక గతంలో సమంత అయితే తెలుగు నాట స్టార్ హీరోయిన్ గా తన ముద్ర వేసింది. చేసిన మూవీస్ లో మాక్సిమం హిట్స్ సాధించి దర్శకనిర్మాతలకు, హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ప్రేమకథ చిత్రాలు దర్శకుడిగా ప్రేత్యేకత సాధించిన గౌతమ్ మీనన్ దర్శకత్వం లో వచ్చిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ లో కి అడుగుపెట్టి యూత్ మనసులు కొల్లగొట్టింది సమంత. చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోస్ తో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఎక్కువ సార్లు 100 కోట్లు సాధించిన సినిమాలలో హీరోయిన్ గా నటించిన ఘనత సాధించింది. ఇక తర్వాత తెలుగు హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళి అయినా కాని సినిమాలు చేస్తూ తన నటన కొనసాగిస్తుంది.
ఇక కన్నడ బ్యూటీ రష్మిక మండన్న కూడ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరికీ హాట్ ఫేవరెట్ గా మారింది. వరుస విజయాలు అందుకుంటూ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది రష్మిక. ఇక రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించి మెప్పించింది. ఆ సినిమాతో రష్మిక కూడా 100 కోట్ల హీరోయిన్ గా ఘనత సాధించింది. ఇక ప్రస్తుతం బన్నీ సరసన పుష్ప మూవీలో నటిస్తుంది.
ఇక పోతే ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ లు కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారట. ఒక యంగ్ డైరెక్టర్ వీరిద్దరి కోసం ఒక మాంచి కథని సిద్ధం చేశాడట. ఆ కథ ఇద్దరికి నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పేశారంట. ఆ కథ ఒక ఫిమేల్ సెంట్రిక్ స్టోరీ ఆధారంగా తెరకెక్కనుందట. ఇందులో వీరిద్దరూ కలిసి అక్క చెల్లెల్లుగా కలిసి నటించబోతున్నారని సమాచారం. ఇంకా సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తొందర్లో వెల్లడవుతాయి.