సంచలన ఆరోపణలు చేస్తున్న దేవా కట్టా.. తనకధలను కాపీ చేస్తున్నాడంటూ ఆరోపణ.!

Kothuru Ram Kumar
తెలుగు పరిశ్రమలో దేవా కట్టా తెలియని వారు ఉండరంటే నమ్మి తీరాల్సిందే. తీసినవి రెండు మూడు సినిమాలైనా అతని గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇక ఎంతో మంది కొత్త సినిమా టెక్నీషియన్స్ అతన్నే స్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకో తెలుసా? అతను తీసిన ప్రస్థానం సినిమా చుస్తే మీకే ఆ విషయం బోధ పడుతుంది. షార్ట్‌ ఫిలింతో తన సినిమా జీవితాన్ని ప్రారంభించి.. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్‌ సూర్య వంటి చిత్రాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దేవా.

ప్రస్తుతం ఇతను GMB సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనితో పాటు సాయి ధరమ్ ‌తేజ్‌తో మరో మూవీకి ప్లాన్‌ చేస్తూ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. ఇకపోతే, తాను రాసుకున్న స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌ రాజ్‌ కాపీ కొట్టాడని దేవాకట్టా ఆరోపించడం ఇపుడు టి టౌన్ లో హాట్‌టాపిక్‌ గా మారింది. వివరాల్లోకి వెళితే..
డైరెక్టర్‌ రాజ్ తన వెబ్ ‌సిరీస్‌లో భాగంగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహంపై ఓ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసినదే.

అయితే ఈ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు స్నేహంపై ఓ కాన్సెప్ట్‌ను, స్క్రిప్ట్‌ను ఆల్రెడీ సిద్దం చేసుకోవడంతోపాటు స్క్రిప్ట్‌ ను కూడా రిజిస్టర్‌ చేసుకున్నానని, ఇపుడు ఇదే కథ ఆధారంగా డైరెక్టర్‌ రాజ్‌ వెబ్‌సిరీస్‌ తీస్తున్నారని దేవాకట్టా సంచలన ఆరోపణలు చేశారు. ఇకపోతే డైరెక్టర్‌ రాజ్‌ గతంలో కూడా తన స్క్రిప్ట్‌లను మక్కీకి మక్కీ కాపీ చేశాడని ఆరోపించారు కట్టా.

అయితే ఇంతకు మునుపు, ఎందుకులే అని ఊరుకున్నా కానీ ఈ సారి మాత్రం అతన్ని వదిలిపెట్టేది లేదని దేవాకట్టా ఓ మీడియా సమావేశంలో చెప్పడం పలు చర్చలకు దారితీస్తోంది. ఇక ఈ వివాదం వారిద్దరే తేల్చుకుంటారా లేదా సినిమా పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి తేలుస్తారా లేదంటే లీగల్ ప్రసీడింగ్ తీసుకుంటారా అనేది చూడాలి మరి. ఎంతో టాలెంటెడ్ అయిన దేవా కథను మలచడంలో దిట్ట. స్క్రీన్ ప్లే విషయంలో అసలు రాజీ పడరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: