అనుష్క సినిమా పరిస్థితి ఇది..!

shami
స్వీటీ అనుష్క భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి చేసిన సినిమా నిశ్శబ్ధం. హేమంత్ మధుకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను కోనా ఫిల్మ్ కార్పోరేషన్ లో కోనా వెంకట్ నిర్మించారు. సినిమా టీజర్ అప్పట్లో రిలీజై మంచి అంచనాలు ఏర్పరచుకుంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ టైం లో రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలా లేక ఓటిటిలో రిలీజ్ చేయాలా అన్న కన్ ఫ్యూజన్ లో ఉన్నారు.
ఓ పక్క అనుష్క ఫ్యాన్స్ నిశ్శబ్ధం సినిమా రిలీజ్ ఎప్పుడంటూ చిత్రయూనిట్ ను టార్గెట్ చేస్తుంది. అందుకే ఈ సినిమా ఎలా రిలీజ్ చేయాలో మీరే చెప్పండి అంటూ కోనా వెంకట్ ఆడియెన్స్ కే ఓ ప్రశ్న వేశాడు. థియేటర్స్, ఓటిటి, ఎక్కడైనా అంటూ మూడు ఆప్షన్స్ ఇచ్చాడు కోనా వెంకట్. అయితే అందులో ఆడియెన్స్ పోల్స్ ఎలా వచ్చాయంటే.. థియేటర్ రిలీజ్ కు కేవలం 28.7 శాతం ఓటింగ్ వస్తే.. ఓటిటికి 56.5 శాతం ఓట్స్ వచ్చాయి. ఇక ఎక్కడైనా పర్లేదు అన్న వారు మాత్రం 14.8 శాతం ఉంది.  
సో అనుష్క నిశ్శబ్ధాన్ని ఆడియెన్స్ ఓటిటి రిలీజ్ కోరుతున్నారని తెలుస్తుంది. రిలీజ్ ఎక్కడ చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో ఉన్న అనుష్క సినిమా రిలీజ్ కోసం ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఓటిటి ఆఫర్స్ వస్తున్నా చిత్రయూనిట్ మాత్రం థియేటర్లు రిలీజ్ అయ్యే దాకా వెయిట్ చేయాలని అనుకున్నారు. కాని పరిస్థితి చూస్తుంటే 2021 జనవరి, ఫిబ్రవరి దాకా సినిమాల రిలీజ్ లు ఉండేలా లేవు. అందుకే కోనా వెంకట్ కూడా నిశ్శబ్ధం రిలీజ్ పై ఆడియెన్స్ రివ్యూ తీసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: