అబ్బో ... మహేష్ తో ఒకటి కాదా, ఏకంగా రెండు ఛాన్స్ లు పట్టేసిందా .....??
యువ దర్శకడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఆర్ధిక, బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో భారీ కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్నట్లు టాక్. తొలిసారిగా ఈ సినిమా ద్వారా కీర్తి సురేష్ మహేష్ బాబు ప్రక్కన జోడీ కడుతోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించనున్న ఈ సినిమా కు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా తో పాటు అతి త్వరలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి ల కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ నే హీరోయిన్ గా తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారట.
రెండు రోజుల క్రితం ఈ సినిమా కథను కీర్తికి విపించి ఆమెను ఒప్పించాడట దర్శకుడు వంశీ. అన్ని కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఒకటి భారీ లెవెల్లో నిర్మించనున్న ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఏకంగా రెండవ సారి కూడా మహేష్ ప్రక్కన కీర్తి ఛాన్స్ కొట్టేసినట్లే అని అంటున్నారు విశ్లేషకులు ....!!