సోషల్ మీడియాలో దారుణమైన కామెంట్ లతో ట్రోల్ల్స్ కి గురవుతున్న పూరి జగన్నాథ్, అల్లు అర్జున్.. !!!

Purushottham Vinay
ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కొంతమంది  సెలెబ్రెటిస్ విపరీతంగా మాటలు పడుతున్నారు. ఎంతలా అంటే అసభ్యకరమైన కామెంట్లతో దారుణంగా తిట్ల పాలు అవుతున్నారు. ట్రోల్ల్స్ పై  ఏ పి హెరాల్డ్ అందిస్తున్న ఈ మేటర్ చదవండి.

ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి అందరికి తెలిసిందే. ఒకప్పుడు వరస హిట్లు అందుకున్న పూరి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వటంతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయ్యాడు. పోకిరికి ముందు ఆంధ్రావాలా, సూపర్ సినిమాలతో భారీ ప్లాపులను ఎదుర్కున్నాడు పూరి.తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పూరి జగన్నాథ్ కి పోకిరి సినిమా అవకాశం ఇచ్చాడు. పోకిరి సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పూరి టాప్ డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయాడు. ఇక వరుస ప్లాప్ లు ఎదుర్కుంటున్న పూరికి గతేడాది ఇస్మార్ట్ శంకర్ రూపంలో పెద్ద హిట్ లభించింది.

ఇకపోతే పూరి జగన్నాథ్ మహేష్ బాబుకి ఒక కథ వినిపించగా అది మహేష్ బాబు కి నచ్చలేదు అట. అప్పట్నుంచి మహేష్ కి, పూరికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మీట్ లో పూరి మహేష్ తో మూవీ ఎప్పుడు చేస్తారు అన్న ప్రశ్నకి మహేష్ నాకు హిట్స్ ఉంటేనే మూవీ చేస్తాడు అని బదులు ఇచ్చాడు. దానికి మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పూరీని కామెంట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పూరిని తిట్లతో ముంచెత్తారు. ఆ విషయం అయిపోయిందనుకుంటే ఇప్పుడు మళ్ళీ మహేష్ పుట్టినరోజున విషెస్ చెప్పకుండా సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ బాగుంది అని థమన్ ని, డైరెక్టర్ పరశురామ్ ని పొగుడుతూ మహేష్ ని మెన్షన్ చెయ్యలేదు. దానితో మళ్ళీ ఫ్యాన్స్ పూరిని మాటలతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వివాదంలో అల్లు అర్జున్ కూడ చిక్కుకున్నాడు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ కలెక్షన్స్ ఫేక్ వి అని ఇండైరెక్ట్ గా తన సినిమా వేడుకలో థమన్ చేత పలికించాడు అని ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై సోషల్ మీడియా వేడుకగా ట్రోల్ల్స్ తో దాడి చెయ్యటం మొదలు పెట్టారు. ఈ విధంగా పూరి, బన్నీ లు మహేష్ ఫ్యాన్స్ తో చివాట్లు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: