ఆ పాటలో చరణ్, ఎన్టీఆర్ ల డ్యాన్స్ నిజంగా అదుర్స్ అట .....??

GVK Writings
ఇటీవల ప్రభాస్ తో తీసిన బాహుబలి రెండు భాగాలతో ఎంతో గొప్ప సక్సెస్ లు అందుకుని వాటితో దేశ విదేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు గడించారు దర్శకుడు రాజమౌళి. అయితే తరువాత సినిమా విషయమై కొంత ఆలోచన చేసి, చివరికి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమాని అనౌన్స్ చేశారు రాజమౌళి. పేట్రియాటిక్ కథాంశంతో 1920 ల కాలం నాటి కథగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.  

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో డివివి దానయ్య నిర్మిస్తుండగా ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ని వీలైనంత త్వరగా ప్రారంభించేలా సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి కొన్నాళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ పాత్ర ఇంట్రడక్షన్ వీడియో అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుని సినిమాపై వారిలో భారీ అంచనాలు క్రియేట్ చేసాయి.  

ఇక లేటెస్ట్ గా ఈ సినిమా కు సంబదించి ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, మొత్తం మూడు పాటలు ఉండే ఈ సినిమాలోని ఒక కీలక సందర్భంలో ఎంతో భారీ ఖర్చుతో హై టెక్నీకల్ వాల్యూస్ తో చిత్రీకరించబడిన అద్భుతమైన సాంగ్ ఒకటి ఉందని, విజువల్ గా ఆడియన్స్ ని ఎంతో అలరించే ఈ సాంగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేసే డ్యాన్స్ లు సాంగ్ మొత్తానికి పెద్ద హైలైట్ అని అంటున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్లు అయిన ఈ ఇద్దరు హీరోలు కలిసి డ్యాన్స్ చేసే ఈ సాంగ్ రేపు థియేటర్ లోని ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ ని అందిచడం ఖాయమట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ కి కూడా ఇది మంచి పండుగ వార్త అని చెప్పకతప్పదు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: