చిరు మల్టీస్టారర్ వైపు అడుగులు వేస్తున్నారా..?
చిరంజీవి నెక్ట్స్ ఓ మల్టీస్టారర్ లో నటించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. రీఎంట్రీలోనూ 100 కోట్లకు పైగా వసూల్ చేస్తోన్న మెగాస్టార్, బాబీ దర్శకత్వంలో మల్టీస్టారర్ కి సైన్ చేశాడనే టాక్ వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని, చిరంజీవి బర్త్ డే రోజు మూవీ ప్రకటన వస్తుందని సమాచారం. అయితే ఈ మెగా మల్టీస్టారర్ లో చిరంజీవితో కలిసి నటించబోయే హీరో ఎవరనే దానిపై ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి స్క్రీన్ లో ఉన్నప్పుడు అతని స్టామినాని మ్యాచ్ చేస్తూ ఆడియన్స్ మెప్పించాలంటే మరో హీరో కూడా ఇదే రేంజ్ లో ఉండాలి. లేదంటే చిరంజీవి ఫస్ట్ హీరోగా, మరొకరు సెకండ్ హీరోగా మారిపోతారు. అయితే బాబీ మాత్రం ఈ మల్టీస్టారర్ కి ఒక యంగ్ హీరోని తీసుకోవాలనుకుంటున్నాడట. దీంతో కొంతమంది సాయితేజ్ పేరుని రిఫర్ చేశాడట. కానీ చిరు మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోలతో కలిసి చేస్తే అది ఫ్యామిలీ స్టారర్ అవుతుంది గానీ, మల్టీస్టారర్ కాదని ఫీలవుతున్నాడట. అందుకే అవుట్ సైడర్స్ ని తీసుకోవాలనుకుంటున్నారట. అయితే టాలీవుడ్ లో స్టార్ వార్స్ కి కేరాఫ్ గా మారిన నందమూరి, కొణిదెల హీరోలు తారక్, చరణ్ ఇద్దరూ కలిసి ‘ట్రిపుల్ ఆర్’లో నటిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి మల్టీస్టారర్ లో కూడా ఇలాగే టాలీవుడ్ పెద్ద తలకాయలు అని పేరు తెచ్చుకున్న ఫ్యామిలీ హీరోలెవరైనా నటిస్తే క్రేజ్ పెరుగుతుందని చెప్తున్నారు సినీజనాలు. మరి ఈ మెగామల్టీస్టారర్ లో నటించే యంగ్ స్టర్ ఎవరో చూడాలి.