ఏయన్నార్ బయోపిక్.. నాగార్జున లేదంటే.. అఖిల్ ఉంటుందని అంటున్నాడు..!

shami
బయోపిక్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తున్న ఇలాంటి టైంలో ఏయన్నార్ బయోపిక్ పై కింగ్ నాగార్జున చాలా సందర్భాల్లో ప్రస్థావించారు. మీడియా ఏయన్నార్ బయోపిక్ ఉంటుందా అని చెప్పిన ప్రతిసారి నాన్న గారి లైఫ్ అంతా సినిమా పరిశ్రమలోనే గడిచింది. ఆయన ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమాకు కావాల్సిన డ్రామా ఎక్కడ లేదు. అందుకే ఏయన్నార్ బయోపిక్ ఉండకపోవచ్చని నాగార్జున పలుసార్లు చెప్పుకొచ్చారు.          

అయితే లేటెస్ట్ గా అఖిల్ మాత్రం ఏయన్నార్ బయోపిక్ ఉంటుందని చెప్పడం విశేషం. ఏయన్నార్ బయోపిక్ ఎప్పటికైనా వస్తుంది కాకపోతే సినిమాకు తగినట్టుగా కథ, డైరక్టర్ సిద్ధం అవడానికి టైం పట్టొచ్చని అన్నారు. అంతేకాదు ఏయన్నార్ పాత్రలో అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు నటిస్తారని అన్నాడు అఖిల్. మరి ఏయన్నార్ బయోపిక్ పై నాగార్జున అలా అంటే అఖిల్ ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉంది.

తాత బయోపిక్ చూడాలని అఖిల్ కు ఉందని మాత్రం ఈ విషయంతో అర్ధమవుతుంది. నాగార్జున కూడా ఏయన్నార్ బయోపిక్ కు అడ్డు చెప్పడానికి పెద్ద కారణాలు లేవు. సో త్వరలో మరో లెజెండరీ బయోపిక్ ఉండబోతుదని చెప్పుకోవచ్చు. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బయోపిక్ సినిమాలు ఎలా తీయాలి.. ఎలా తీయకూడదు అన్న క్లారిటీ వచ్చింది. మహానటి సక్సెస్ అవడం మహానాయకుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన రెండు పార్టులు ఫ్లాప్ అవడంతో ఏయన్నార్ బయోపిక్ ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేయాలన్నది మాత్రం నిజం. మరి అక్కినేని ఫ్యామిలీ ఏయన్నార్ బయోపిక్ ఎలా తీస్తారో చూడాలి. బయోపిక్ సినిమాలు తీసే దర్శకుల మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ఏయన్నార్ బయోపిక్ ఎవరి దర్శకత్వంలో తెరకెక్కుతుందో చూడాలి.                       



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: